Latest NewsTelangana

Revanth Reddy says his govt gives 25 thousand jobs in 70 days | Revanth Reddy: హరీశ్ రావు మరో ఔరంగజేబు, 70 రోజుల్లో 25 వేల ఉద్యోగాలిచ్చాం


Revanth Reddy on Harish Rao: ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వహించిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతుందని అన్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. ఇందులో భాగంగా త్వరలోనే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించబోతున్నామని చెప్పారు. 

మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. నువ్వు రాజీనామా చెయ్ నేను చేసి చూపిస్తా అని హరీష్ అంటుండు. హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది. పదేళ్లు మంత్రిగా ఉండి హరీష్ ఏం చేశారు? మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిండ్రు. దశ బాగుంటే దిశతో పని లేదు. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలి.

-రేవంత్ రెడ్డి

3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? మా ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25 వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టాం.. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా? మీరు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా.. ఇంకేం చేసినా.. ప్రజలు మీపై సానుభూతి చూపరు. బీఆర్ఎస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలలు మూసేసింది. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటాం.

గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకోస్తాం. 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్ లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కొడంగల్ లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. ఈ మోడల్ ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశిస్తున్నా’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

YSRCP and BRS Targets Chandrababu ఎక్కడ, ఏం జరిగినా బాబే కారణమా?

Oknews

ప్రభాస్ గురించి మాటల్లో చెప్పను చేతల్లోనే చూపిస్తాను

Oknews

జాన్వీ కపూర్ ఎంట్రీలో ట్విస్ట్.. ఎన్టీఆర్ వెనక్కి, బన్నీ ముందుకి!

Oknews

Leave a Comment