Latest NewsTelangana

Weather in Telangana Andhrapradesh Hyderabad on 16 February 2024 Winter updates latest news here | Weather Latest Update: నేడు సాధారణంగానే ఉష్ణోగ్రతలు


Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.8 డిగ్రీలుగా నమోదైంది. 68 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

మండిపోతున్న ఎండలు
గ్రేటర్ హైదరాబాద్ లో ఎండలు ఇప్పుడిప్పుడే మండి పోతున్నాయి. ఫిబ్రవరిలో నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలతో నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్చి నెల కాక ముందే ఎండలు మండి పోతుండడంతో మార్చి నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.

Andhra Pradesh Weather: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వాతావరణ పొడిగా ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే  అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

ఇష్టంలేని పెళ్లి….! నవవధువు ఆత్మహత్య-bride committed suicide by hanging herself in medak district ,తెలంగాణ న్యూస్

Oknews

పవన్ కళ్యాణ్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్!

Oknews

Telangana high court hears petition over women free ride in TSRTC Buses

Oknews

Leave a Comment