రోజూ మూడు పూటలా తినడం వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా? | Is eating three meals a day good for health or not|The importance of three meals a day| Aim for 3 Meals a Day| Meals in Day| How Eating 3 Meals a Day Contributes to Weight Loss| Why Is It Healthy to Eat Three Meals a Day


posted on Feb 16, 2024 9:30AM

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే 24 గంటల్లో మూడు సార్లు ఆహారం తీసుకోవాల్సిందేనని  చాలా అధ్యయనాల్లో స్పష్టమైంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం,  రాత్రి భోజనం ఈ మూడూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో  చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి తప్పినా ఆరోగ్యానికి పెనుముప్పు సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.

అసలీ సమస్య ఎప్పుడొస్తుందంటే..

సాధారణంంగా చాలామంది  బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా రోజులో ఏదో ఒక పూట ఆహారాన్ని స్కిప్ చేస్తుంటారు. కానీ   ఇలా చేయడం ద్వారా బరువు తగ్గుతారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టమైంది. దీనికి బదులుగా ఇలా ఆహారం ఎగ్గొట్టడం అనే అలవాటు చాలా సమస్యలను పెంచుతుంది. ఉదయం అల్పాహారం తీసుకోకపోతే, అది  శరీరంలో అనేక వ్యాధుల సమస్యలను పెంచుతుందని  పరిశోధనలు కూడా చెబుతున్నాయి.  ఇలా ఆహారాన్ని స్కిప్ చెయ్యడం వల్ల  గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

భోజనం మానేయడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటంటే..

 ఏదైనా తిన్న ప్రతిసారీ మీ పిత్తాశయం పైత్యరసాన్ని విడుదల చేస్తుంది, ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అయితే ఆహారం తీసుకోకపోయినా పిత్త రసం అదే విధంగా ఉత్పత్తి అవుతుంది. ఆహారం తీసుకోకపోతే ఆ పిత్తరసం పనిచేయకుండా ఉండిపోతుంది. దీనికారణంగా అది  పిత్తాశయంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితి పిత్తాశయంలో గట్టిపడిన కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది, ఇది పిత్తాశయంలో రాళ్లకు దారితీస్తుంది.

 తరచుగా రోజులో ఒకపూట ఆహారం తీసుకోవడం మానేస్తే.. ముఖ్యంగా ఉదయం పూట, స్థూలకాయం, అధిక రక్తపోటు, లిపిడ్ ప్రొఫైల్ సమస్యలు, మధుమేహం,  మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు మొదలవుతాయి.  గుండె జబ్బుల ప్రమాదం సాధఘారణంకంటే ఎక్కువగా ఉంటుంది.ఇది కార్డియోమెటబోలిక్ ప్రమాదాలకు మూలకారణం అవుతుంది.

గుండె జబ్బులను నివారించడానికి,  ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవడం అవసరం. ఇప్పటికే డయాబెటిక్ ఉన్నవారు  ఒక పూట  భోజనం స్కిప్ చేయడం మరింత  సమస్యాత్మకంగా మారుతుంది. ఇది ఆహారం తీసుకోవడం,  ఇన్సులిన్ ఉత్పత్తి మధ్య అసమతుల్యతను ప్రోత్సహిస్తుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఇన్సులిన్ లేదా బ్లడ్ షుగర్ తగ్గించే మందులపై ఆధారపడిన మధుమేహం ఉన్న చాలా మంది వ్యక్తులకు, రక్తంలో చక్కెర శాతం ఉన్నపళంగా తగ్గడం చాలా ప్రమాదం.

                                                                                                        *నిశ్శబ్ద



Source link

Leave a Comment