Entertainment

‘భామా కలాపం 2’ మూవీ రివ్యూ



మూవీ : భామా కలాపం-2 

నటీనటులు:  ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, చైతు జొన్నలగడ్డ, సుదీప్ వేద్ , అనీష్ తదితరులు

ఎడిటింగ్: విప్లవ్ నైషద్

మ్యూజిక్: ప్రశాంత్ విహారి

సినిమాటోగ్రఫీ: దీపక్

నిర్మతలు :  బాపినీడు భోగవల్లి, సుధీర్ ఈదర

రచన, దర్శకత్వం: అభిమన్యు తడిమేటి

ఓటీటీ : ఆహా

గత ఏడాది భామా కలాపంతో సక్సెస్ ని అందుకున్న ప్రియమణి.. దానికి కొనసాగింపుగా భామాకలాపం2 తో మన ముందుకొచ్చింది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం…

కథ: 

అనుపమ(ప్రియమణి) కోల్ కతా లోని ఓ అపార్ట్మెంట్ లో రెంట్ కి ఉంటుంది. అయితే తను పక్కవాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేదు‌. అందుకే ఎప్పుడు పక్క ఫ్లాట్ లో ఏం అయినా గొడవ జరుగుతుందా అనే ఆలోచిస్తు ఏదో అపార్ట్మెంట్ లో ఏదో ఒక గొడవ తీసుకొచ్చి భర్తకి తలనొప్పిగా మారుతుంది. అయితే అనుపమ వంటలు చేస్తూ యూట్యూబ్ లో వ్లాగ్స్ తో ఫేమస్ అవ్వాలనుకుంటుంది. ఒకరోజు మ్యూజియంలో 200 కోట్ల విలువైన బంగారు గుడ్డు మాయవడంతో అనుపమ ఇబ్బందుల్లో పడుతుంది. ఎలాగు  అ కష్టాల నుండి అనుపమ ఫ్యామిలీ బయట పడుతుంది. ఇది మొదటి పార్ట్.. అయితే రెండవ పార్ట్ లో 1000 కోట్ల విలువైన కోడి బొమ్మని కుకింగ్ కాంపిటీషన్ లో గెలిచిన వారికి ప్రైజ్ మనీగా ఇస్తామని ఓ కాంపీటీషన్ లో చెప్తారు. అయితే ఆ కాంపిటీషన్ కి అనుపమ సెలెక్ట్ అవుతుంది‌. అదే విషయం భర్తతో చెప్పేలోపే తను బిజీగా ఉన్నానంటూ తప్పుకుంటాడు. అదే సమయంలో విలన్ ని పట్టుకునేందుకు గవర్నమెంట్ నుండి కొంతమంది పోలీసులు ప్రయత్నిస్తారు. అయితే అనుపమ ఆ కాంపిటీషన్ లో పాల్గొందా? ఇందులో జుబేదా ( సీరత్ కపూర్) రోల్ ఏంటి?  అనుపమ ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

మొదటి పార్ట్ లో మిస్ అయిన స్క్రీన్ ప్లేని, మ్యూజిక్, కథని అన్నింటిని ఈసారి జాలా జాగ్రత్తగా రాసుకొని ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తుంది. మొదటి పది నిమిషాల్లోనే  కథలో లీనం చేసేసాడు డైరెక్టర్.

అనుపమ(ప్రియమణి) కి సపోర్ట్ గా చేసిన శరణ్య ప్రదీప్ కామెడీ భళే కుదిరింది. ఎక్కడ బోర్ కొట్టకుండా అటు ఇంటెన్స్ తో పాటు కామెడీని జోడిస్తూ అలా చివరి దాకా తీసుకెళ్ళారు. దొంగతనం జరిగే సీన్ నుండి కథ అమాంతం హైప్ వచ్చేస్తుంది. అయితే తను ఎందుకు అలా చేస్తుందో చివరికి రివీల్ అయ్యే ట్విస్ట్ లు అన్నీ కుదిరాయి కానీ కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉన్నాయి. పెద్ద పెద్ద విషయాలని సింపుల్ గా తేల్చిపడేస్తారు. ఫస్ట్ సాంగ్ లోనే క్యారెక్టర్లు పరిచయం చేసినా అక్కడక్కడా స్లోగా సాగే సీన్లు కాస్త ఇబ్బంది పెడతాయి.

క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగున్నప్పటికీ తనెలో తప్పించుకుంటుందనే లాజిక్ ని మిస్ అయ్యారు మేకర్స్. జుబేదా(సీరత్ కపూర్) బోల్డ్ సీన్స్ తప్పితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. దొంగతనం అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు చూసేసాం‌‌.. వాటి తాలుకా ఛాయలు ఈ క్రైమ్ లో కనిపిస్తుంటాయి.  విప్లవ్ నైషద్ ఎడిటింగ్ బాగుంది‌. ఫస్టాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్లని ట్రిమ్ చేస్తే బాగుండేది. ప్రశాంత్ విహారి మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ అయింది. ఇంటర్వెల్ లో, దొంగతనం సీన్స్ లో.. క్లైమాక్స్ ఇలా దొరికిన చోటల్లా నిరూపించుకు‌న్నాడు. దీపక్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు : 

అనుపమ పాత్రలో ప్రియమణి ఒదిగిపోయింది. పనిమనిషిగా శరణ్య ప్రదీప్ ఆకట్టుకుంది. జుబేదాగా సీరత్ కపూర్ మెరిసింది. బోల్డ్ సీన్స్ కోసమే తనని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

ఫైనల్ గా…

లాజిక్స్ ని పట్టించుకోకుండా చూస్తే వర్త్ వాచింగ్ మూవీ. లాజిక్స్ కావాలంటే పర్ ఫెక్ట్ గా ఉండాలంటే ఓసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2.75 /5

✍️. దాసరి  మల్లేశ్



Source link

Related posts

ఓటీటీలోకి భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

ప్రేమకోసం ఖండాలు దాటి వెళ్లిన యంగ్‌ హీరో.. ఫలితం.. బ్రేకప్‌!

Oknews

రీ రిలీజ్ అవుతున్న క్లాసిక్ ఫిల్మ్!

Oknews

Leave a Comment