రామగుండంలో ఉద్యోగాలు
RFCL Job Notification: రామగుండం ఫెర్టిలైజన్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్‌ఎఫ్‌ఎల్, ఈఐఎల్, ఎఫ్‌సిఐఎల్ జాయింట్ వెంచర్ సంస్థ అయిన రామగుండంఫెర్టిలైజర్స్ కంపెనీలో మేజేన్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజా నోటిఫికేషన్‌లో మొత్తం 7రకాల ఉద్యాగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో కెమికల్ విభాగంలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 10, మెకానికల్ మేనేజ్‌మెంట్ ట్రైనీలో పోస్టులు 6, ఎలక్ట్రికల్ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 3, ఇన్‌స్ట్రుమెంటేషన్ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 3, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనీ పోస్టులు 2, లా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 1, హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 3 ఉన్నాయి. మొత్తం 28 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.