పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో శ్రీధర్ వర్మ సాగి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు. మంచి కథను ఎంచుకొని, వినోదభరితమైన చిత్రాన్ని అందించడమే లక్ష్యంగా ఎంతో కష్టపడుతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.
సుకుమార్ పమ్మి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ అద్భుతమైన పాటలు అందిస్తున్నారట. తాజాగా ఈ చిత్రం నుంచి ‘చందమామే’ అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది. ఈ లిరికల్ వీడియో ప్రముఖ దర్శకుడు పరశురామ్ చేతుల మీదుగా లాంచ్ కావడం విశేషం. ఈ సందర్భంగా డైరెక్టర్ పరశురామ్ చిత్ర యూనిట్ ని అభినందించారు.
‘చందమామే’ సాంగ్ వింటుంటే చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. లిరిక్స్, ట్యూన్ ఎంతో అందంగా వినసొంపుగా ఉన్నాయి. ఈ పాట ఆకట్టుకోవడమే కాదు సినిమాపై కూడా ఆసక్తిని పెంచేలా ఉంది. మరి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ‘రవికుల రఘురామ’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.