Sports

India Vs England 3rd Test Day 2 Duckett Slams Record Ton


India vs England  3rd Test Day 2 : రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్‌-ఇంగ్లాండ్‌ పోరాడుతున్నాయి.  తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు 445 పరుగులు చేయగా… బ్రిటీష్‌ జట్టు కూడా ధీటుగా స్పందిస్తోంది. బజ్‌బాల్‌ ఆటతో దాదాపు ఓవర్‌కు ఆరు రన్‌రేట్‌తో ఇంగ్లాండ్‌ పరుగులు రాబట్టింది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసిన బ్రిటీష్‌ జట్టు… భారత కంటే 238 పరుగులు వెనకపడి ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. క్రాలే 133, రూట్‌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరుతో 326 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు 445 పరుగులకు ఆలౌట్‌ అయింది.

భారత ఇన్నింగ్స్‌ ముగిసిందిలా..
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ , రవీంద్ర జడేజా సెంచరీ హీరోలుగా నిలువగా తొలిసారి బరిలో దిగిన బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్ , ధ్రువ్ జురెల్కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఓవర్నైట్ 326/5 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా  రెండు పరుగులు మాత్రమేచేసి పెవిలియన్ బాట పట్టాడు. జో రూట్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో డెబ్యూ ప్లేయర్‌ ధ్రువ్‌ జరెల్‌తో కలిసి సీనియర్ ప్లేయర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ జట్టు స్కోరు ముందుకు తీసుకెళ్లాడు. ఎనిమిదో వికెట్కు వీరు 77 పరుగులు జోడించారు. కానీ స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. చివర్లో బుమ్రా దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లోనే మూడు ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేశాడు. మూడో టెస్టులో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది.

ధీటుగా బదులిస్తోన్న ఇంగ్లాండ్‌
టీమిండియాను 445 పరుగులకు ఆలౌట్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. బ్రిటీష్‌ జట్టుకు ఓపెనర్లు డకెట్‌, క్రాలే శుభారంభం అందించారు. టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ సాధికారికంగా బ్యాటింగ్‌ చేశారు. తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మంచి పునాది వేశారు. ఈ జోడీని టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ విడదీశాడు. 15 పరుగులు చేసిన క్రాలేను అశ్విన్‌ అవుట్‌ చేశాడు. క్రాలే అవుటైనా డకెట్‌ వెనక్కి తగ్గలేదు. ధాటిగా బ్యాటింగ్‌ చేసిన క్రాలే కేవలం 88 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 88 బంతుల్లో 19 ఫోర్లు, ఒక సిక్సుతో క్రాలే శతకం సాధించాడు. క్రాలే వంద పరుగుల్లో 82 పరుగులు బౌండరీల రూపంలోనే రావడం గమనార్హం. భారత పిచ్‌లపై వేగంగా మూడో శతకం సాధించిన బ్యాటర్‌గా కూడా క్రాలే రికార్డు సృష్టించాడు. గిల్‌క్రిస్ట్‌ 84, క్లైవ్‌ లాయిడ్‌ 85 బంతుల్లో భారత పిచ్‌లపై మెరుపు సెంచరీలు చేయగా…. క్రాలే 88 బంతుల్లో సెంచరీ సాధించాడు. మరోవైపు 39 పరుగులు చేసిన ఓలి పోప్‌ను వికెట్ల ముందు సిరాజ్‌ దొరకపుచ్చుకోవడంతో బ్రిటీష్‌ జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. దీంతో 182 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అనంతరం రూట్‌, క్రాలే మరో వికెట్‌ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. క్రాలే 133, రూట్‌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.



Source link

Related posts

KKR vs SRH IPL 2024 SRH chose to field

Oknews

Ravindra Jadeja Unlikely For Next 2 Tests As India’s Troubles Mount Amid England Series

Oknews

BCCI Test Cricket Incentive Scheme: టెస్టు క్రికెట్ లో కూడా గట్టిగా సంపాదించొచ్చు… ఎలానో చూడండి..!

Oknews

Leave a Comment