GossipsLatest News

Exciting news from NBK 109 NBK 109 నుంచి అదిరిపోయే న్యూస్



Fri 16th Feb 2024 11:27 AM

nbk 109  NBK 109 నుంచి అదిరిపోయే న్యూస్


Exciting news from NBK 109 NBK 109 నుంచి అదిరిపోయే న్యూస్

సీనియర్ హీరోలందరిలో హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్న నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బాబీ తో NBK109 లో నటిస్తున్నారు. 2024 ఎన్నికల ముందే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలనుకున్నా.. ప్రస్తుతం అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మే కానీ జూన్ కానీ NBK 109 ని మంచి తేదీ చూసి విడుదల చేసే ఆలోచనలో ఉన్న మేకర్స్.. ఈ చిత్రానికి సంబంధించి ఏ అప్ డేట్ ఇచ్చినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఫుల్లీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య పవర్ ఫుల్ కేరెక్టర్ లో సూపర్ మేకోవర్ లో కనిపించబోతున్నట్లుగా టాక్.

సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న NBK109 నుంచి ఇప్పుడొక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం NBK109 ఇంటర్వెల్ బ్యాంగ్ ని తెరకెక్కిస్తున్నారట. బాలయ్యపై ఓ అదిరిపోయే క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నట్టుగా యూనిట్ సభ్యుల నుంచి వినిపిస్తోన్న వార్తతో నందమూరి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. దీనితో వారు నాలుగో హిట్ గ్యారెంటీ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేల్ల కీ రోల్ లో నటిస్తుండగా.. నోలీవుడ్ క్రేజీ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.


Exciting news from NBK 109:

NBK 109 latest update 









Source link

Related posts

గోపీచంద్ మరో సాహసం.. 'రాధేశ్యామ్' దర్శకుడితో సినిమా!

Oknews

విజయదశమికి విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప

Oknews

భగవద్గీతను అవమానించిన బిత్తిరి సత్తి.. సారీ చెప్పమంటే…

Oknews

Leave a Comment