గతంలో ఎమ్మెల్యేగా పోటీకంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancharla Chandrasekhar Reddy)…. బీఆర్ఎస్ నేతగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ లో పని చేసిన ఈయన… 2014 ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో చేరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికలో 47,292 ఓట్లు సాధించిన ఆయన… తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో 11,056 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలంపాటు నియోజకవర్గంలో యాక్టివ్ గా పని చేశారు. ఇదిలా ఉండగానే… టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారెక్కారు. దీంతో 2018 ఎన్నికల్లో మంచిరెడ్డికే టికెట్ దక్కింది. ఫలితంగా కంచర్లకు టికెట్ రాకుండా పోయింది. ఆ తర్వాత కొంతకాలంగా సెలైన్స్ ఉన్న ఆయన… గత అసెంబ్లీ ఎన్నికల వేళ స్పీడ్ పెంచారు. ఏకంగా నాగార్జున సాగర్ బరిలో ఉంటానని ప్రకటన కూడా చేశారు. స్థానికంగా అనేక కార్యక్రమాలను కూడా చేపట్టారు.
Source link