ByGanesh
Sat 17th Feb 2024 11:09 AM
మెగా అభిమానులు టెన్షన్ పడడం లో తప్పు లేదు. నిన్నమొన్నటివరకు గేమ్ చెంజర్ మేకర్స్ కి లేని కంగారు మెగా ఫాన్స్ కి ఎందుకు అన్నవారే.. ఇప్పుడు దేవర, పుష్ప 2 రిలీజ్ డేట్స్ వచ్చాకా మెగా ఫాన్స్ ఆందోళన పడుతూ గేమ్ ఛేంజర్ డేట్ కోసం అడగడంలో ఎలాంటి తప్పు లేదు అంటున్నారు. నిజమే స్టార్ హీరోలంతా తొందర పడుతుంటే గేమ్ ఛేంజర్ మేకర్స్ మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా సైలెంట్ మోడ్ లో కనిపిస్తున్నారు. దర్శకుడు శంకర్-రామ్ చరణ్-దిల్ రాజు ఇలా ఎవ్వరూ గేమ్ ఛేంజర్ అప్ డేట్ పై స్పందించడం లేదు.
ఎన్టీఆర్ దేవర డేట్ ని పోస్ట్ పోన్ చేస్తూ కొత్త డేట్ లాక్ చేసాడు. అటు అల్లు అర్జున్ ఆగస్టు 15 టార్గెట్ గా దూసుకుపోతున్నాడు. కానీ గేమ్ ఛేంజర్ డేట్ మాత్రం ఇంకా ఇంకా సస్పెన్స్ లో పెడుతున్నారు. దసరాకి హెవీ కాంపిటీషన్ అన్నట్టు దేవర డేట్ వచ్చాక అర్ధమైంది. మరి గేమ్ ఛేంజర్ వినాయకచవితికి అయినా లేదంటే దసరా అయినా అన్నవారు.. ఇప్పుడు దేవర డేట్ లాక్ అయ్యాక దసరా సమయంలో పోటీకి దిగలేరు. సో గేమ్ ఛేంజర్ ని డిసెంబర్ లాస్ట్ వీక్ క్రిష్ట్మస్ కి షిఫ్ట్ చెయ్యాల్సి ఉంటుంది.
లేదంటే 2025 సంక్రాంతికి అనుకుంటే అక్కడా కాంపిటీషన్ మాములుగా లేదు. మరి గేమ్ ఛేంజర్ మేకర్స్ తొందరపడకపోతే మిగతా భారీ బడ్జెట్ సినిమాలు కచ్చిఫ్ లు వేసి కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాయి.
Mega fans are not wrong in their concern:
Wake up Game Changer makers