- ముందుగా పీఎం విశ్వకర్మ అధికారిగా వెబ్ సైట్ పై క్లిక్ చేయండి (https://www.pmvishwakarmagov.com/)
- హోంపేజ్ లోని ‘Login’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇందులో ‘అప్లికెంట్/బెనిఫియరీ లాగిన్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత అప్లికెంట్ ఫోన్ నెంబర్ తో లాగిన్ అవ్వండి.
- అనంతరం దరఖాస్తు దారుడి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- అప్లికేషన్ ఎడిట్ లో లోన్ కు సంబంధించిన వివరాలు ఎడిట్ చేసుకోవచ్చు.
ఈ పథకానికి అర్హులెవరు
ఈ పథకానికి ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన 18 రకాల కులస్తులు అర్హులు. ముఖ్యంగా సంప్రదాయ కులవృత్తులైన వడ్రంగి, బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు, శిల్పాలు విగ్రహాలు తయారు చేసే వారు, బుట్టలు, చాపలు, మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వారు, చీపుర్లు తయారీదారులు, దోబీ, టైలర్, చేప వలను తయారు చేసేవాళ్లు, చెప్పులు కుట్టేవారు, తాపీ కార్మికులు, క్షురకులు, సంప్రదాయ బొమ్మలు,పూల దండలు, రజకులు పడవల తయారీదారులు, ఇంటి తాళాలు తయారీదారులు అర్హులు.