EntertainmentLatest News

ఊరు పేరు భైరవకోన.. పార్ట్-2 కూడా ఉంది!


‘టైగర్’ తర్వాత హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ వీఐ ఆనంద్‌ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఫిబ్రవరి 16న విడుదలైన ఫాంటసీ థ్రిల్లర్ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మంచి వసూళ్లనే రాబడుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి పార్ట్-2 కూడా ఉంది. ఈ విషయాన్ని ఎండ్ టైటిల్స్ లో రివీల్ చేయనప్పటికీ.. తాజాగా సందీప్ కిషన్ రివీల్ చేశాడు.

తాజాగా ఓ నెటిజన్ “ఊరు పేరు భైరవకోన సినిమా బాగుంది. పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేయొచ్చుగా” అంటూ సందీప్ కిషన్ ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ కి “ఉంది” అంటూ రిప్లై ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు సందీప్. దీంతో “ఊరు పేరు భైరవకోన”కు సీక్వెల్ ఉందని క్లారిటీ వచ్చింది.

అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, పి. రవిశంకర్ తదితరులు నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రాజ్ తోట, ఎడిటర్ గా ఛోటా కె ప్రసాద్ వ్యవహరించారు.



Source link

Related posts

brs ex mp joginapally santosh kumar responds on forgery case | Joginapally Santosh Kumar: ఫోర్జరీ కేసుపై స్పందించిన బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్

Oknews

breaking news march 5 live updates telangana cm revanth reddy Andhra Pradesh cm jagan Sharmila chandra babu pawana kalyan janasena tdp lokesh ktr harish rao pm narendra modi brs bjp congress | Telugu breaking News: మంగళగిరిలో టీడీపీ జనసేన జయహో బీసీ సభ

Oknews

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు.. రాశీ ఖన్నా!

Oknews

Leave a Comment