Latest NewsTelangana

Investment Post Office Small Saving Scheme Interest Rates For January March 2024 Quarter


Small Saving Scheme Interest Rates 2024: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి ‍‌(January-March Quarter 2024) చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను, 2023 డిసెంబర్‌ చివరిలో, కేంద్ర ప్రభుత్వం సవరించింది. కొత్త వడ్డీ రేట్లు 01 జనవరి 2024 నుంచి ప్రారంభమయ్యాయి మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం, చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంది. 

చిన్న మొత్తాల పొదుపు పథకం అంటే ఏంటి?
ప్రజల్లో పొదుపు అలవాటును పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం చిన్న మొత్తాల పొదుపు పథకం. పేద ప్రజలు కూడా ఈ పథకాల్లో చాలా తక్కువ మొత్తంలో నెలనెలా/నిర్దిష్ట సమయంలో డబ్బు దాచుకోవచ్చు. జమ చేసిన డబ్బుపై వడ్డీ వస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాలు దాచిన తర్వాత అసలు+వడ్డీ కలిపి ఒకేసారి ఎక్కువ మొత్తాన్ని ప్రజలు తిరిగి తీసుకోవచ్చు. 

ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇవి… 1, 2, 3, 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు/ టైమ్ డిపాజిట్లు, 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ ‍‌(RD), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ (POMIS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర (KVP), సుకన్య సమృద్ధి యోజన ‍(SSY).

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 2024 (Sukanya Samriddhi Yojana Interest Rate for Jan-Mar 2024)
2023 డిసెంబర్‌ 29న ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం… 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజనపై (SSY) వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం పెంచింది, ఆ స్కీమ్‌ ఇన్వెస్టర్లకు న్యూయర్‌ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. ఈ పథకంపై వడ్డీ రేటును గతంలోని 8 శాతం నుంచి ఇప్పుడు 8.2 శాతానికి ‍‌(SSY new interest rate) కేంద్ర ప్రభుత్వం పెంచింది. స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌లో సుకన్య సమృద్ధి యోజన ఒక ప్రత్యేక పథకం. బాలికల కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ స్కీమ్‌ను అమలు చేస్తోంది. 2023 ఏప్రిల్‌-జూన్‌ కాలంలోనూ సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటును 7.6 శాతం నుంచి 8 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో కలిపితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) SSY వడ్డీ రేటును 0.60 శాతం పెరిగింది.

3 సంవత్సరాల టర్మ్‌ డిపాజిట్లపైనా వడ్డీ రేటును గతంలోని 7 శాతం నుంచి ఇప్పుడు 7.1 శాతానికి (New interest rate on 3 years term deposit) కేంద్ర ప్రభుత్వం పెంచింది. మిగిలిన చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు, యథాతథంగా కొనసాగించింది. 

2024 జనవరి- మార్చి త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు

– పొదుపు డిపాజిట్లపై ‍‌4 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. 
 – 1 సంవత్సరం టైమ్ డిపాజిట్‌పై 6.9 శాతం
– 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7 శాతం 
– 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7.1 శాతం
– 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7.5 శాతం 
– 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై 6.7 శాతం 
– సుకన్య సమృద్ధి యోజనపై 8.2 శాతం వడ్డీ రేటు
– నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై ‍‌వడ్డీ రేటు (NSC Interest rate) 7.7 శాతం 
– కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టే వారికి 7.5 శాతం వడ్డీ (KVP Interest rate) వడ్డీ రేటు. దీని మెచ్యూరిటీ కాలం 115 నెలలు.
– సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై 8.2 శాతం (SCSS Interest rate) 
– పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్‌ పథకంపై 7.4 శాతం (POMIS Interest rate) 
– పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో పెట్టుబడులపై 7.1 శాతం (PPF Interest rate) 

స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌లో పీపీఎఫ్‌ (Public Provident Fund) బాగా పాపులర్‌ పథకం. ఈ స్కీమ్‌ వడ్డీ రేటును 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మార్చలేదు. పీపీఎఫ్‌ స్కీమ్‌లో మెచ్యూరిటీ మొత్తానికి ఆదాయ పన్ను వర్తించదు. 

మరో ఆసక్తికర కథనం: రోజుకు రూ.100 ఇన్వెస్ట్‌ చేసి నెలకు రూ.57,000 పొందడం ఎలా?



Source link

Related posts

CM KCR Comments on AP Roads జగన్ ఇజ్జత్‌ను అంగట్లో పెట్టిన కేసీఆర్..

Oknews

రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల మధ్య బీజేపీ తగవులు పెడుతుంది- తమ్మినేని వీరభద్రం-khammam news in telugu cpm tammineni alleged bjp at centre putting clashes between states ,తెలంగాణ న్యూస్

Oknews

Anushka is an equal pair for senior heroes అనుష్క పట్టించుకోవడం లేదా.. లేదంటే..!

Oknews

Leave a Comment