Latest NewsTelangana

breaking news February 19th live updates telangana cm revanth reddy Andhra Pradesh cm jagan Sharmila chandra babu lokesh Shankharavam ktr harish rao pm narendra modi bjp congress | Telugu breaking News: విశాఖ సాగర తీరంలో మిలాన్‌-2024


Latest Telugu breaking News: విశాఖ మరో అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కాబోతోంది. ఇండియన్‌ నేవీ ఆధ్వర్యం లో జరిగే మిలాన్‌-2024ను ఈసారి విశాఖలో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19 నుంచి 27 వరకు రెండు దశల్లో మిలాన్‌ నిర్వహించేందుకు నేవీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మిలాన్‌ వేడుకల్లో పాల్గొనేందుకు 50 దేశాల నుంచి అతిథులు వస్తున్నారు. మిలాన్‌ విన్యాసాల్లో పాల్గొనేందుకు 15 దేశాలకు చెందిన ఇప్పటికే విశాఖకు చేరుకున్నాయి.దీంతో విశాఖ సాగర తీరం సందడిగా మారింది.

మిలాన్‌ కోసం వచ్చిన యుద్ధ నౌకల్లో మేరీటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కూడా ఉంది. ఇం డియన్‌ నేవీ నుంచి 20 యుద్ధనౌకలు, యుద్ధ విమాన వాహక నౌకలు విక్రాంత్‌, విక్రమాదిత్య, పీ8ఐ నిఘా విమానం, మిగ్‌ 29 యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి. రెండు దశల్లో జరగనున్న మిలాన్‌ వేడుకలకు వేలాది మంది ప్రేక్షకులు హాజరుకానున్నారు. తొలి దశలో హార్బర్‌ ఫేజ్‌లో ఇంటర్నే షనల్‌ సిటీ పెరేడ్‌, మేరిటైమ్‌ సెమినార్‌, మిలాన్‌ టెక్‌ ఎక్స్‌పో, మిలాన్‌ విలేజ్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. రెండో దశ సీ ఫేజ్‌లో భాగంగా గగన తల పోరాట పటిమను ప్రదర్శించే విమానాలు, హెలికాప్టర్లు, యాంటీ సబ్‌మెరైన్‌ విన్యాసాలు ప్రదర్శించనున్నారు.బీచ్‌ రోడ్డులో నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పెరేడ్‌కి లక్ష మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని నేవీ అధికారులు అంచనా వేశారు. 30 ఎన్‌క్లోజర్లు, 30 ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాట్లు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నా రు. వీవీఐపీ, వీఐపీ రక్షణ ఏర్పాట్లు, బందోస్తు తదితరాలను పోలీసు విభాగం ఆధ్వర్యంలో చేపట్టా రు. బీచ్‌ ప్రాంతంలో బార్‌కేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఐఐసీ, ఏయూ మైదానంలో పార్కింగ్‌ సదుపాయాలు కల్పించారు.

మిలాన్‌కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ మల్లిఖార్జున తోపాటు ఇతర అధికారులు పరిశీలించారు. నిర్వహణ లోపం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేవీకి చెందిన ఉన్నతాధికారులు కూడా పరిశీలించా రు.మిలాన్‌ నేపథ్యంలో బీచ్‌ రోడ్డు, సముద్ర తీరంలో చేపట్టిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నా యి. స్కై డైవర్స్‌ పారాచూట్ల సహాయంతో చేసిన విన్యాసాలు మెస్మరైజ్‌ చేశారు. నేవీ హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ ఆర్మీతోపాటు పలు దేశాలకు చెందిన నేవీ సిబ్బంది చేపట్టిన మార్చ్‌ఫాస్ట్‌ ఆకట్టుకుంది.వేలాది మంది సందర్శ కులు బీచ్‌కు తరలివచ్చి విన్యాసాలను తిలకించారు. మిలాన్‌ వేడుకలు కోసం నగరవాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విశాఖ సాగరతీరంలో మిలాన్‌-2024కు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి 27 వరకు రెండు దశల్లో జరిగే మిలాన్‌-2024కు ఆర్కే బీచ్‌ రోడ్డులో నేవీ, జిల్లా అధికారులు కలిసి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మిలాన్‌కు 50 దేశాల నుంచి అతిథులు వస్తున్నారు. 15 విదేశీ యుద్ధనౌకలు పాల్గొంటాయి. మేరీటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కూడా రానుంది. భారత నౌకాదళం తరఫున 20 యుద్ధనౌకలు, యుద్ధ విమాన వాహకనౌకలు విక్రాంత్‌, విక్రమాదిత్య, పీ 8ఐ నిఘా విమానం, మిగ్‌ 29కే తదితరాలు పాల్గొంటున్నాయి. తొలిదశ హార్బర్‌ ఫేజ్‌లో ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌, మారీటైమ్‌ సెమినార్‌, మిలాన్‌ టెక్‌ ఎక్స్‌పో ఉంటాయి. రెండో దశ సీ ఫేజ్‌లో భాగంగా గగనతల పోరాట పటిమను ప్రదర్శించే విమానాలు, హెలికాప్టర్లు, యాంటీ సబ్‌మెరైన్‌ విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. బీచ్‌రోడ్డులో నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌కు లక్ష మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున 30 ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేసినట్టు కలెక్టర్‌, నేవీ అధికారులు వివరించారు. వీవీఐపీ, వీఐపీ రక్షణ ఏర్పాట్లు, బందోబస్తు వంటివాటిని పోలీసు విభాగం చూస్తోంది. బీచ్‌ ఏరియాలో బారికేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఐఐసీ, ఏయూ మైదానంలో పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. కలెక్టర్‌ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ, నేవల్‌ కమాండర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, మిలాన్‌ నిర్వహణలో భాగంగా జరిగిన రిహార్సల్స్‌ ఆద్యంతం ఆకట్టుకున్నాయి.



Source link

Related posts

Lavanya Tripathi Interesting Comments On Her Acting Career నటనకు గుడ్ బై చెప్పేదేలే : లావణ్య

Oknews

మళ్ళీ డ్రగ్స్ కలకలం.. సిద్ధార్థ్ అరెస్ట్.. లిస్టులో పలువురు తెలుగు హీరోలు!

Oknews

Harish Rao Participates Dasara Celebrations At Siddipet

Oknews

Leave a Comment