దిశ, ఫీచర్స్: హిందూమతంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ తులసిలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో రామ తులసి మొక్క రాముడికి చాలా ప్రియమైనది, అలాగే కృష్ణతులసి మొక్క శ్రీకృష్ణుడికి ప్రీతికరమైనది. ఇందులో ఈరోజు మనం రామ,శ్యామ్ తులసి గురించి తెలుసుకుందాం.
హిందూమతంలో తులసి చాలా ముఖ్యమైన మొక్క. తులసిని నాటిన ఇంట్లో విష్ణువు ఉంటాడని . తులసిని ప్రజల విశ్వాసం. ప్రతి రోజు పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. తులసిలో రెండు రకాలు ఉన్నాయి: రామ తులసి, కృష్ణ తులసి. ఈ రెండు తులసిలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి.
రామ తులసి,కృష్ణ తులసి ప్రాముఖ్యత
రామ తులసి రాముడిని ప్రసన్నం చేస్తుంది, కృష్ణ తులసి శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేస్తుంది. రామ తులసిని ప్రధానంగా పూజలలో ఉపయోగిస్తారు. కానీ కృష్ణ తులసిని ప్రధానంగా ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇంట్లో రెండు తులసి మొక్కను నాటడం శుభంగా భావిస్తారు. రామ తులసిని ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. కృష్ణ తులసి మొక్క నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ఆది, ఏకాదశి, గురు, శుక్ర, సూర్యగ్రహణం రోజుల్లో తులసి మొక్కను నాటకూడదు.