TSPSC Group1 Notification: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 563 పోస్టుల భర్తీకీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గత ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దుచేసిన ప్రభుత్వం తాజాగా గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణలో గత ప్రభుత్వం 503 పోస్టులతో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఫిబ్రవరి 19న రద్దు చేసిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ కావడంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే పాత ఖాళీలకు అదనంగా 60 పోస్టులను జతచేస్తూ మొత్తం 563 ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
రెండు సార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాలేదు. రెండు సార్లు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, భర్తీ ప్రక్రియ మాత్రం సజావుగా సాగలేదు. మొదట 2022 ఏప్రిల్ లో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ప్రిలిమ్స్ నిర్వహణ జరిగి, ఫలితాలు సైతం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారని అంతా అనుకుంటున్న సమయంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందని ఆరోపణలు రావడంతో మొదట ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు చేశారు. దాంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ తొలిసారి రద్దయింది. గతంలో టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకుని, తాజాగా ఆ నోటిఫికేషన్‌ను రద్దుచేసి, కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించింది. తొలిసారి ఎగ్జామ్ నిర్వహించిన సమయంలో బయోమెట్రిక్ లాంటి విషయాలతో పాటు ఎంతో జాగ్రత్తగా ఎగ్జామ్ నిర్వహించారు. కానీ రెండోసారి నిర్వహించిన ఎగ్జామ్ లలో అవకతవకలు జరిగాయని, నిబంధనలు సరిగ్గా పాటించలేదని గ్రూప్ 1 (Group 1) ప్రిలిమినరీ మరోసారి రద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. విషయం హైకోర్టు వరకు వెళ్లడంతో ఎగ్జామ్ రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కేసు విచారణలో ఉండగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఉద్యోగ పరీక్షల వయోపరిమితి పెంపు..
ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితిని 44 సంవత్సరాల నుంచి 46 ఏళ్లకు పెంచింది. అయితే యూనిఫామ్ సర్వీసులకు మాత్రం మినహాయింపునిచ్చింది. వయోపరిమితి నుంచి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు నిర్దేశించిన గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రూప్-1 సహా చాలా పోటీ పరీక్షల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది. అయతే ఐతే ప్రశ్నపత్రాల లీకేజీల వల్ల, పరీక్షల నిర్వహణ వాయిదా పడుతోంది. దాంతో వారి వయసు పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో.. వయసు పెరిగినా, అభ్యర్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు వీలు కలగనుంది.
మరిన్ని చూడండి