వాహనదారుడికి కుమారి ఆంటీ డైలాగ్హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్న ఓ వాహనదారుడి ఫొటోను హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police) ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీనికి క్యాప్షన్ గా ” మీది మొత్తం వెయ్యి అయ్యింది. యూజర్ ఛార్జెస్ ఎక్స్ ట్రా” అంటూ ట్వీట్ చేశారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం, ట్రాఫిక్ నియమాలను పాటించండి, సేఫ్ డ్రైవింగ్ చేయండని పోలీసులు యాష్ ట్యాగ్ లు జోడించారు. సిటీ పోలీసుల వినూత్న ప్రయత్నంపై నగర వాసులతో పాటు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Source link