Latest NewsTelangana

Top Telugu News Today From Andhra Pradesh Telangana 20 February 2024 | Top Headlines Today: వైసీపీలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రీ ఎంట్రీ!


Telugu News Today 20 February 2024: వైసీపీలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రీ ఎంట్రీ- ఒకేసారి షర్మిల, లోకేష్‌పై గురి పెట్టిన జగన్ – ఏపీ ముఖ్యమంత్రి అనుంగ శిష్యుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna ReddY) మళ్లీ సొంతగూటికి వచ్చారు. సోదరుడు అయోధ్య రామిరెడ్డితో కలిసి ఈ మధ్యాహ్నం సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి నుంచి 2019లో వైసీపీ తరుఫున ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ మధ్య కాలంలోనే జగన్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయింపులు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే – సీఎం జగన్, కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల
ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధుల విడుదల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు హయాంలో నామమాత్రంగా ఉన్న పథకాన్ని తాము బాగు చేశామని అన్నారు. ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి వెంటనే నిధులు ఇచ్చేట్టుగా మార్చామని అన్నారు. గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజీ సర్టిఫికెట్లు ఇచ్చేట్టుగా మార్పులు చేశామని వివరించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం, నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్ప రథయాత్రలు
తెలంగాణలో బీజేపీ(BJP) ఎన్నికల శంఖారావం పూరించింది. తమకు ఎంతో కలిసొచ్చిన రథయాత్ర పేరిట తెలంగాణ వ్యాప్తంగా రథయాత్రులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రమొత్తాన్ని లోక్ సభ నియోజకవర్గాల వారీగా ఐదు క్లస్టర్లుగా విభజించి…ఒక్కో క్లస్టర్ కు ఒక రథాన్ని పంపింది. ఈ విజయసంకల్ప రథం..ఆయా లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనుంది. ఈ ప్రచార రథాలను నిన్న చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కిషన్ రెడ్డి ప్రారంభించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

కేంద్ర విద్యా సంస్థలు ప్రారంభం, తిరుపతి ఐఐటీ, ఐఐటీ హైదరాబాద్, వైజాగ్ ఐఐఎం జాతికి అంకితం
 ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన పేర్కొన్న మేరకు తిరుపతిలోని ఐఐటీ(IIT), ఐసర్(IISER) తోపాటు విశాఖలో ఐఐఎం(IIM) వంటి కేంద్ర విద్యా సంస్థలకు సొంత భవనాలు సమకూరాయి. ఇన్నాళ్లు అద్దె భవనాల్లో కొనసాగిన ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు  నేడు సొంత భవనాల్లో కొలువుదీరాయి. నేడు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో  అద్భుతాలు సృష్టిస్తూ , సరికొత్త ఆవిష్కరణలకు  తోడ్పాడు అందిస్తూ విద్యావ్యాప్తికి  పునాదులు వేస్తున్న  తిరుపతి ఐఐటీ, ఐసర్ సంస్థలు నేడు సొంత భవనాల్లో కొలువుదీరాయి.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

బొత్స ఇలాకాలో ఈసారి ఎవరు చూపించేను తడాఖా..!
 విజయనగరం జిల్లా రాజకీయాలను గడిచిన రెండు దశాబ్ధాల నుంచి శాసిస్తున్న బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లి. ఉమ్మడి విజయనగరం జిల్లాలోన అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. గడిచిన నాలుగు ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఇక్కడి నుంచి మూడుసార్లు విజయం సాధించారు. విజయం సాధించిన మూడుసార్లు మంత్రిగా కొనసాగారు. అటువంటి నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో ఎవరి పక్షాన ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండబోతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి



Source link

Related posts

మూడు కుండలో మధ్యలో కుండ..ఇదంతా ఏంటీ చెప్పండి.!

Oknews

Heroine Surabhi చావు అంచులవరకు వెళ్ళొచ్చా: సురభి

Oknews

Megha Engineering : ‘మేఘా’ చేతికి మంగోలియా ఆయిల్‌ రిఫైనరీ ప్రాజెక్ట్‌

Oknews

Leave a Comment