AP Jobs : కడప, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో రోడ్లు, భవనాల శాఖలో(R&B Jobs) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా(Kadapa Jobs)లో 24 పోస్టులు, నెల్లూరు జిల్లా(Nellore Jobs)లో 27 పోస్టులు, పల్నాడు జిల్లాలో 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ను సూపరింటెండెంట్ ఇంజినీర్(ఆర్ అండ్ బి) కార్యాలయం, సర్కిల్ ఆఫీస్, మారుతి నగర్, కడప చిరునామాకు పోస్టు చేయాలి. నెల్లూరు ఆర్ అండ్ బీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్లను ఆర్ అండి బీ సర్కిల్ ఆఫీసర్, నెల్లూరు జిల్లా, దర్గామిట్టా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. పల్నాడు జిల్లా ఆర్ అండ్ బీ శాఖలో పోస్టులకు దరఖాస్తులను అభ్యర్థులు పల్నాడు ఆర్ అండ్ బీ ఇంజినీరింగ్ ఆఫీసర్, ప్రకాశ్ నగర్, పల్నాడు జిల్లా, నరసరావుపేట-522601 చిరునామా పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకూడదు. నెల వేతనం రూ.15,000 చెల్లిస్తారు.