దిశ, ఫీచర్స్: ఫస్ట్ టైం రైల్లో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. పరీక్షకు హాజరు కావాల్సిన ఆ యువతి తప్పని సరి పరిస్థితుల్లో రైల్లో ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చింది. అయితే.. తాను రిజర్వేషన్ చేయించుకున్న టికెట్ లాస్ట్ మినిట్‌లో కన్ఫామ్ అయింది. అంతే కాకుండా ట్రైన్ కూడా లేట్‌గా వచ్చింది. ఇక యువతి తన ప్లేస్‌లోకి వెళ్లి చూడగా.. అక్కడ ఒక పెద్దాయన తన ఫ్యామిలీతో కూర్చుని ఉన్నాడు. ఇది నా ప్లేస్ అని యువతి చెప్పింది. వెంటనే పెద్దాయన యువతిపై సీరియస్ అవుతూ గట్టిగా కేకలు వేశాడు. ఇక చేసేదేమి లేక.. పైన బెర్త్‌పై కూర్చుంది. పైన బెర్త్‌పై కూడా అప్పటికే ఇద్దురు కూర్చుని ఉండగా.. ఉన్న ప్లేస్‌లోనే సర్ధుకుని కూర్చింది. ఈ దీన స్థితిని ఫొటోలు, వీడియోలు తీసి తన అక్కతో పంచుకుంది.
తన చెల్లి పరిస్థితికి తల్లడిల్లిన అక్క.. ఆ స్క్రీన్ షార్ట్‌లను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో.. రైల్వే అధికారుల వరకు చేరుకుంది. ఇక వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు.. బోగిలోకి వెళ్లి అతడిని సీటు ఖాళీ చేయించి ఆ యువతికి కేటాయించారు. కేవలం 20 నిమిషాల్లోనే తమ సమస్య పరిష్కారమైందంటూ ఆ యువతి సోదరి నెట్టింట పంచుకోగా.. అధికారులపై ప్రశంసలు కురిపిస్తు్న్నారు నెటిజన్లు.
For the first time my younger sister is travelling alone by train.
Anyhow we got our ticket confirmed at the last moment and train arrived 3hrs late.