Sports

Anushka Sharma Virat Kohli Blessed With Baby Boy Couple Names Him Akaay What Is The Meaning Of Akaay | Akaay Kohli: విరూష్కల రెండో బిడ్డ అకాయ్


Akaay Meaning : భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli) రెండోసారి తండ్రయ్యాడు. తన భార్య అనుష్క శర్మ(Anshuka Sharma) ఈ నెల 15న మగబిడ్డకు జన్మనిచ్చిందని కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపాడు. కొడుకు పేరు అకాయ్‌(Akaay) అని పేర్కొన్నాడు. కోహ్లి, అనుష్కలకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె వామిక ఉంది. ఫిబ్రవరి 15న వామిక తమ్ముడు అకాయ్‌ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించామని కోహ్లీ తెలిపాడు. ఈ విషయం అందరికీ చెప్పడానికి సంతోషిస్తున్నామని… ఈ అందమైన సమయంలో అందరీ ఆశీర్వాదాలు కావాలంటూ కోహ్లీ ఇన్‌ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆకాయ్ అంటే ఏంటో తెలుసా. సంస్కృతంలో కాయ్ అంటే శాశ్వతమైనది, చిరంజీవి, పాడు కానిది అని అర్థం. కాయం, శరీరం. హిందీలో కాయ్ అంటే కాయం లేదా శరీరం.  పరమశివుడు శరీరం లేనివాడు కాబట్టి ఆకాయ్ అంటే పరమ శివుడనే అర్థం కూడా ఉంది. ఇక  తుర్కిష్ భాషలో అకాయ్ అంటే.. నిండు చందమామ లేదా కాంతులీనుతున్న పున్నమి చంద్రుడు అని అర్థం.  

సచిన్‌ శుభాకాంక్షలు
ఈ వార్త తెలిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు విరుష్క జంటను అభినందిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కూడా సోషల్ మీడియా వేదికగా కోహ్లీ, అనుష్కలకు శుభాకాంక్షలు తెలియజేశాడు. మీ అందమైన కుటుంబంలోకి అమూల్యమైన అకాయ్ వచ్చినందుకు విరాట్, అనుష్కలకు అభినందనలంటూ సచిన్‌ పోస్ట్ చేశాడు. అకాయ్ అనే పేరులోనే నిండుచంద్రుడు ఉన్నాడని.. అతడు మీ ఇంట్లో ఇక వెలుగులు నింపినట్టే అని సచిన్‌ అన్నాడు. అతను మీ ప్రపంచాన్ని అంతులేని ఆనందం, నవ్వుతో నింపుతాడని అన్నాడు. మీరు ఎప్పటికీ ఆదరించే జ్ఞాపకాలు మీ వెంటే ఉంటాయని ఆశిస్తున్నాను. ప్రపంచానికి స్వాగతం.. లిటిల్ ఛాంప్!’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, వరుణ్ చక్రవర్తి క్రికెటర్లు విరాట్, అనుష్కలకు శుభాకాంక్షలు తెలిపారు.  

డెలివరీ అయి బిడ్డ పుట్టిన  విషయాన్ని అనుష్క స్వయంగా ప్రకటించింది. అయితే అయిదు రోజులు ఆలస్యంగా ఆమె ఈ గుడ్‌న్యూస్‌ను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది.

“ప్రేమతో నిండిన హృదయాలు మరియు అంతులేని ఆనందంతో మీ అందరితో ఒక శుభవార్త పంచుకుంటున్నాను. అదేంటంటే ఈ ఫిబ్రవరి 15న మాకు మగబిడ్డ పుట్టాడు. అతని పేరు అకాయ్‌ (Akaay). వామిక లిటిల్‌ బ్రదర్‌ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ శుభసమయం, అద్భుతమైన సమయంలో మాకు మీ అందరి అశీర్వాదాలు, బెస్ట్‌ విషెష్‌ కావాలి. అలాగే మా ప్రైవసీని కూడా గౌరవిస్తారని ఆశీస్తూ.. మీ విరాట్‌ అండ్‌ అనుష్క” అంటూ మగబిడ్డ పుట్టాడంటూ కొద్ది సేపటి  క్రితమే అధికారిక ప్రకటన ఇచ్చింది అనుష్క.  



Source link

Related posts

International table tennis player Naina Jaiswal conferred doctorate at 22

Oknews

మయాంక్ ఎక్స్ ప్రెస్ రెండు మ్యాచ్ లకు దూరం.

Oknews

Pro Kabaddi League Schedule: ప్రొ కబడ్డీ లీగ్ టీమ్స్, హైదరాబాద్ లెగ్ షెడ్యూల్ ఇదే

Oknews

Leave a Comment