టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే ఏ శక్తి ఆపలేదు
వైఎస్ఆర్ వేల కోట్లు సంపాదించి తన ఇద్దరు బిడ్డలకు ఇస్తే…అందులో చెల్లికి వాటా ఇవ్వలేదు జగన్ (Jagan)అంటూ ఆరోపించారు. సాక్షి పేపర్, భారతి సిమెంట్ లో సొంత చెల్లికి వాటాలు ఇవ్వని వ్యక్తి జగన్ అన్నారు. సొంత చెల్లికే ఆస్తి ఇవ్వని వ్యక్తి సమాజానానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక జనసేన మరింత బలపడిందన్నారు. వైసీపీ సిద్ధం అంటే జనసేన యుద్ధం అంటుందన్నారు. తనను ఆపాలని చూస్తే మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాన్నారు. వైసీపీ పాలనతో అప్పుల్లో కూరుకుపోయిన ఏపీని టీడీపీ, జనసేన కూటమే రక్షించాలన్నారు. రాష్ట్రానికి మంచి జరగాలనే పొత్తు కోసం ప్రయత్నించానన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే మనల్ని ఏ శక్తి ఆపలేదని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే ఈసారి ఓట్లు చీలకూడదని పిలుపునిచ్చానన్నారు.