తెలుగు సినిమాని పాన్ ఇండియా రేంజ్ తో పాటు ప్రపంచ సినిమా స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తన పేరుతోనే జనాలని థియేటర్స్ కి రప్పించగల దర్శక ధీరుడు. మరి అలాంటి ఆయనకి ఒంటి చేత్తో సినిమాని హిట్ చేసే సత్తా కలిగిన మహేష్ బాబు కలిస్తే ఇంకేమైనా ఉందా ఆ మూవీ ప్రపంచ రికార్డులు కొల్లగొట్టడం ఖాయం. అందుకు ముహూర్తం అతి త్వరలోనే రానుంది. అంతలోపు ఆ మూవీ గురించి వస్తున్న పుకార్లుకి బ్రేక్ పడనుంది
SSMB 29 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటుంది. తన మూవీకి సెట్ అయ్యే ఆర్టిస్టులని ఎంచుకునే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడు. కొన్ని రోజులుగా చిత్ర బృందానికి సంబంధం లేకుండానే ఆ మూవీకి సంబంధించిన విషయాల మీద సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు వస్తున్నాయి. దీంతో అతి త్వరలోనే జక్కన్న& మూవీ టీమ్ ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మూవీకి సంబంధిచిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకోబోతుంది.అప్పటి వరకు ఎటువంటి పుకార్లుని నమ్మవద్దని టీం చెప్తుంది. అలాగే ఆ రోజున సినిమా టైటిల్ తో పాటు మహేష్ తో కలిసి స్క్రీన్ ని పంచుకోబోయే ఇతర నటీనటుల వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది.
ఈ ప్రతిష్టాత్మక మూవీని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.ఈ సంస్థ నుంచి గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కీరవాణి సంగీత సారథ్యంలో తెరకెక్కుతుండగా విజయేంద్ర ప్రసాద్ కథ ని అందించాడు. ఇండియన్ టెక్నీషియన్సే కాకుండా విదేశీ టెక్నీషియన్స్ కూడా వర్క్ చెయ్యనున్నారు.