EntertainmentLatest News

ప్రభాస్ వెనక్కి తగ్గడు..చిరంజీవి సినిమా డేట్ కే పక్కాగా వస్తున్నాడు


రెబల్ స్టార్ ప్రభాస్  క్షణం తీరిక కూడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రెజంట్ సెట్స్ మీద ఉన్న కల్కి 2898ఎడి, రాజాసాబ్ లాంటి డిఫెరెంట్ జోనర్స్ కి సంబంధించిన  సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.రాజా సాబ్ కమర్షియల్ టచ్ ఉన్న రెగ్యులర్ సినిమా కాగా  కల్కి మాత్రం పీరియాడిక్ సబ్జెట్. ఇప్పుడు ఈ మూవీ ఆరునూరు అయినా సరే మేము చెప్పిన డేట్ కే వస్తుందని మేకర్స్ అంటున్నారు. 

వాస్తవానికి  కల్కి మొన్న  జనవరిలో రిలీజ్ కావాల్సిన మూవీ. కానీ  మే నెలకి వాయిదా పడింది.అయితే ఇప్పుడు మే   నుంచి కూడా వాయిదా పడచ్చనే  రూమర్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో  రంగంలోకి దిగిన మేకర్స్  కల్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మే 9 న రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. ఆ డేట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని కూడా చెప్తున్నారు. అన్నట్టు మే 9 న  చిరంజీవి సూపర్ హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపధ్యంలో ఆ డేట్ కి విపరీతమైన క్రేజ్ ఉంది.పైగా రెండు సినిమాల ప్రొడ్యూసర్ కూడా ఒకరే.  

ఎడ్వెంచర్ థ్రిలర్ గా రూపొందుతున్న  కల్కి మీద ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరోసారి  ఇండియన్ సినిమా రికార్డులు గల్లంతవ్వడం ఖాయమని కూడా  అంటున్నారు.ప్రభాస్ తో  దీపికా పదుకునే జతకడుతుండగా  మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్ లాంటి మేటి నటులు కూడా కల్కి లో చేస్తున్నారు. ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పై  అశ్వనీ దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 

 



Source link

Related posts

పెళ్ళయిన 20 ఏళ్ళ తర్వాత కూడా విడాకులు తప్పవా? టెన్షన్‌లో సూపర్‌స్టార్‌ అభిమానులు!

Oknews

అప్పుడే ఓటీటీలోకి 'గామి'..!

Oknews

ఈ కూటమి నాయకులకు ఏమైంది !!

Oknews

Leave a Comment