Jahnavi Kandula : అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రోడ్డు దాటుతున్న ఆమెను.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది . అయితే విచారణ జరిపిన అక్కడి అధికార యంత్రాగంం పోలీస్ అధికారిపై ఎలాంటి కేసు ఉండబోదని అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. బు కందుల జాహ్నవి మృతి ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసేదే అయినా.. ఆమె యాక్సిడెంట్ కేసులో సియాటెల్ పోలీస్ అధికారి కెవిన్ డేవ్‌కు వ్యతిరేకంగా సరిపడా ఆధారాలు లేనందున చర్యుల తీసుకోవం లేదని అధికారులు ప్రకటించారు.
ఈ ప్రకటనపై జాహ్నవి బంధువులు, పలువురు భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసర్ కెవిన్ డేవ్ అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తేలినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఆమె మృతిపై అవమానించేలా మాట్లాడిన అధికారి విషయంలోనూ చర్యలు ఏవని ప్రశ్నిస్తున్నారు. ఈ తీర్పును కేటీఆర్ కూడా ఖండించారు. విదేశాంగ మంత్రి జయశంకర్ జయశంకర్ జోక్యం చేసుకోవాలని కోరారు. [
Disgraceful & absolutely unacceptable !
I demand the @USAmbIndia to take up the matter with US Government authorities and deliver justice to the family of young Jaahnavi Kandula
I request EA Minister @DrSJaishankar Ji to take up the matter with his counterpart & demand a… https://t.co/90pw59LtCo
— KTR (@KTRBRS) February 22, 2024
ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. కానీ ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో కెవిన్ విధి నిర్వహణలోనే ఉన్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని అధికారులు తేల్చారు. కెవిన్‌పై క్రిమినల్ చర్యలు లేకపోయినా.. డిపార్ట్‌మెంట్ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు ఉంటాయని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. గత ఏడాది ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి మృతి చెందింది. కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. అయితే.. ఈ ఘటన గురించి సమాచారం అందించిన తరుణంలో ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. ఈ ఆడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మరిన్ని చూడండి