Latest NewsTelangana

Revanth Reddy directed officials to take necessary precautions on drinking water ahead of summer season | Revanth Reddy: సాగ‌ర్‌ నుంచి ఏపీకి సాగు నీరు త‌ర‌లించొద్దు


Revanth Reddy Review Meet: వేస‌వి కాలంలో తాగు నీటి ఎద్ద‌డి త‌లెత్త‌కుండా చూడాల‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వ‌ర్షాభావంతో జ‌లాశ‌యాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్న నేప‌థ్యంలో తాగు నీటి స‌ర‌ఫ‌రాలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై డాక్ట‌ర్ బి.ఆర్‌.అంబేడ్క‌ర్ స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డితో క‌లిసి సాగు నీరు,ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, తాగు నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల అధికారుల‌తో గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. తొలుత రాష్ట్రంలో జ‌లాశ‌యాల్లో నీటి నిల్వ‌లు, తాగు నీటికి అవ‌స‌ర‌మైన నీటి ప‌రిమాణంపై అధికారులు గ‌ణాంకాలు వివ‌రించారు. 

కేఆర్ఎంబీకి లేఖ
అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ న‌గ‌రాలు/ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలు,తండాలు, గూడేలు, ఎస్సీ కాల‌నీలు అనే తేడా లేకుండా ప్ర‌తి నివాస ప్రాంతానికి తాగు నీరు అందేలా సాగు నీరు, ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, తాగు నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. తాగు నీటి కోసమంటూ నాగార్జున సాగ‌ర్‌ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ 9 టీఎంసీల‌కుపైగా నీరు తీసుకుపోతోందని అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. అంత పెద్ద మొత్తంలో తాగు నీరు ఎక్క‌డ వినియోగిస్తున్నార‌ని, స‌రైన గ‌ణాంకాలు తీసుకొని  ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. నాగార్జున సాగ‌ర్‌, శ్రీ‌శైలం ప్రాజెక్టుల నుంచి తాగు నీటికి నీరు తీసుకోవాలంటే కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) లేఖ రాయాల్సి ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఎంత నీరు అవ‌స‌ర‌మో స‌మ‌గ్రంగా స‌మీక్షించి వెంట‌నే కేఆర్ ఎంబీకి లేఖ రాయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. 

జులై నెలాఖ‌రు వ‌ర‌కు ఎక్క‌డ తాగు నీటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూసేందుకు ఆయా జిల్లాల్లో ఉన్న నీటి వ‌న‌రులు, అవ‌స‌ర‌మైన తాగు నీటి ప‌రిమాణం, స‌మ‌స్య‌లు అధిగ‌మించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో రెండు రోజుల్లో స‌మీక్ష నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యద‌ర్శిని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.  ఈసంద‌ర్భంగా ఆర్‌డ‌బ్ల్యూఎస్ ప‌రిధిలో సిబ్బందికి వేత‌నాలు ఇవ్వ‌డం లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. గ‌త రెండేళ్లుగా జీతాలు ఇవ్వ‌డం లేద‌ని అధికారులు తెలిపారు. వేత‌న బ‌కాయిల‌పై ఆరా తీసిన ముఖ్య‌మంత్రి క్షేత్ర స్థాయి సిబ్బందికి వేత‌నాలు అందేలా ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు. తాము నిధులు విడుద‌ల చేస్తామ‌ని వాటిని బ‌డా బాబుల‌కు ఇవ్వ‌కుండా క్షేత్ర స్థాయి సిబ్బందికి అందేలా చూడాల‌ని ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారుల‌కు సూచించారు. 

జీహెచ్ఎంసీ ప‌రిధిలోనూ..
గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ ప‌రిధిలోనూ తాగు నీటికి ఎటువంటి స‌మ‌స్య లేకుండా చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పెద్ద‌గా ఇబ్బందులు లేవ‌ని, ఏదైనా కొర‌త ఏర్ప‌డితే ఎల్లంప‌ల్లి, నాగార్జున సాగ‌ర్ నుంచి కొంత‌మేర తెప్పించుకునే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. న‌గ‌రంలోని నీటి అవ‌స‌రాల‌పై సూక్ష్మ స్థాయి (మైక్రోలెవ‌ల్‌)లో స‌మీక్షించి త‌గిన ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని సీఎం సూచించారు. న‌గ‌రంలో కొన్ని ప్రాంతాల్లో ట్యాంక‌ర్ల రాక‌పోక‌ల‌కు పోలీసుల నుంచి కొంత ఇబ్బంది ఉంద‌ని అధికారులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వేస‌వి పూర్త‌య్యే వ‌ర‌కు తాగు నీటి ట్యాంక‌ర్ల రాక‌పోక‌ల విష‌యంలో పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూడాల‌ని పోలీసు ఉన్న‌తాధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు, ఈ నెల 21 నుంచి అందుబాటులో!-hyderabad news in telugu south central railway special trains to medaram from february 21st ,తెలంగాణ న్యూస్

Oknews

Again Movie in Nani and Srikanth Odela Combo నాని-శ్రీకాంత్: దసరా కి సీక్వెల్ కాదా?

Oknews

Are Kalki promotions enough? కల్కి ప్రమోషన్స్ సరిపోతాయా?

Oknews

Leave a Comment