ByGanesh
Thu 22nd Feb 2024 05:51 PM
సమంత కెరీర్ లో నటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో.. ఆమె హెల్త్ విషయంలో అంతే కేర్ తీసుకుంటూ స్లిమ్ గా గ్లామర్ గా కనిపించడానికి వర్కౌట్స్ చేస్తుంది. ఎన్ని కిలోలయినా సునాయాసంగా ఎత్తేసే సమంత స్ప్రింగ్ లా మారిపోయి జిమ్ లో చమటలు చిందిస్తుంది. ఆమె మాయోసైటిస్ బారిన పడక ముందు కోపం వచ్చినా, స్ట్రెస్ ఫీలయినా ఎక్కువగా జిమ్ లోనే ఉంటాను అని చెప్పింది. ఇక మాయోసైటిస్ వచ్చాక అంతగా వర్కౌట్స్ చెయ్యని సమంత ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చేసింది.
ఎప్పుడూ ఫిట్ నెస్ విషయంలో కేరింగ్ గా ఉండే సమంత డే లో కొత సమయాన్ని జిమ్ కి కేటాయిస్తుంది. తాజాగా సమంత ఓ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్ చూస్తే సమంత చైనా పీస్ లా, స్ప్రింగ్ లా ఉంది అంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు. సమంత ఒంటి కాలి ఫీట్ అది. చుట్టూ పచ్చని వాతావరణం, పెద్ద పేద చెట్లు, దాని పక్కనే సముద్రం, సూర్యుడికి ఎదురుగా ఆమె చేసిన వర్కౌట్ విన్యాసాలు అందరిని ఆకట్టుకుంటుంది. సమంత ఫీట్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇక ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ కంప్లీట్ చేసి షూటింగ్స్ కి బిగ్ బ్రేక్ ఇచ్చిన సమంత మళ్ళీ నటనకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న విషయాన్ని రివీల్ చేసింది. మరి త్వరలోనే సమంత నుంచి కొత్త ప్రాజెక్ట్ వివరాలు ఏమైనా వస్తాయేమో అని ఆమె అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.
Samantha Workout Pic Goes Viral:
Samantha Ruth Prabhu Best Kind of Morning