Latest NewsTelangana

Ramagundam Fertilizers and Chemicals Limited has released notification for the recruitment of Experienced professionals Posts


Ramagundam Fertilizers and Chemicals Limited: రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 27 అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, అడిషనల్ సీఎంవో పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో సరైన అర్హతలు, అనుభవం ఉన్న సీనియర్ ప్రొఫెషల్స్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈపోస్టుల భర్తీకి ఫిబ్రవరి 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

వివరాలు..

🔰 ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెషనల్స్

ఖాళీల సంఖ్య: 27

➥ కెమికల్: 05 పోస్టులు

    ⫸ అసిస్టెంట్ మేనేజర్: 02 పోస్టులు

    ⫸ సీనియర్ మేనేజర్: 02 పోస్టులు

    ⫸ చీఫ్ మేనేజర్: 01 పోస్టు

అర్హత: కెమికల్ ఇంజినీరింగ్/కెమికల్ టెక్నాలజీ విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

అనుభవం: అసిస్టెంట్ మేనేజర్-4 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్-16 సంవత్సరాలు, చీఫ్ మేనేజర్-20 సంవత్సరాలు.

➥ మెకానికల్: 04 పోస్టులు

    ⫸ మేనేజర్: 02 పోస్టులు

    ⫸ చీఫ్ మేనేజర్: 01 పోస్టు

    ⫸ డిప్యూటీ జనరల్ మేనేజర్: 01 పోస్టు

అర్హత: మెకానికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీ విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

అనుభవం: మేనేజర్-12 సంవత్సరాలు, చీఫ్ మేనేజర్-20 సంవత్సరాలు, డిప్యూటీ జనరల్ మేనేజర్-23 సంవత్సరాలు.

➥ ఎలక్ట్రికల్: 01 పోస్టు

    ⫸ సీనియర్ మేనేజర్: 01 పోస్టు

అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఈఈఈ/టెక్నాలజీ విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

అనుభవం: కనీసం 16 సంవత్సరాలు.

➥ ఇన్‌స్ట్రుమెంట్: 01 పోస్టు

    ⫸ చీఫ్ మేనేజర్: 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

అనుభవం: కనీసం 20 సంవత్సరాలు.

➥ కెమికల్ ల్యాబ్: 03 పోస్టులు

   ⫸ అసిస్టెంట్ మేనేజర్: 02 పోస్టులు

   ⫸ డిప్యూటీ మేనేజర్: 01 పోస్టు

అర్హత: ఎంఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

అనుభవం: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 4 సంవత్సరాలు, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 8 సంవత్సరాలు.

➥ మెటీరియల్స్: 02 పోస్టులు

     ⫸ చీఫ్ మేనేజర్: 02 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంబీఏ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్/సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్) లేదా పీజీ డిప్లొమా (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి. 

అనుభవం: కనీసం 20 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ ఫైనాన్స్ & అకౌంట్స్: 04 పోస్టులు

   ⫸ అసిస్టెంట్ మేనేజర్: 02 పోస్టులు

   ⫸ సీనియర్ మేనేజర్: 02 పోస్టులు

అర్హత: సీఏ/సీఎంఏ లేదా ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. 

అనుభవం: అసిస్టెంట్ మేనేజర్ 4 సంవత్సరాలు, చీఫ్ మేనేజర్ పోస్టులకు 20 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ హ్యూమన్ రిసోర్స్ (HR): 02 పోస్టులు

  ⫸ అసిస్టెంట్ మేనేజర్: 01 పోస్టు

  ⫸ సీనియర్ మేనేజర్: 01 పోస్టు 

అర్హత: ఎంబీఏ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ లేదా రెండేళ్ల పీజీ డిప్లొమా/డిగ్రీ (HRM) ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది

అనుభవం: అసిస్టెంట్ మేనేజర్ 4 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 16 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ మెడికల్: 03 పోస్టులు

  ⫸  సీనియర్ మెడికల్ ఆఫీసర్: 02 పోస్టులు

  ⫸  అడిషనల్ సీఎంవో: 01 పోస్టు

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎండీ/ఎంఎస్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

అనుభవం: సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 4 సంవత్సరాలు, అడిషనల్ సీఎంవో పోస్టులకు 12 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ సేఫ్టీ: 02 పోస్టులు

    ⫸ అసిస్టెంట్ మేనేజర్: 01 పోస్టు

    ⫸ మేనేజర్: 01 పోస్టు

అర్హత: ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫుల్‌టైమ్ డిగ్రీ/ డిప్లొమా/ఇండస్ట్రియల్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉండాలి.

అనుభవం: అసిస్టెంట్ మేనేజర్ 4 సంవత్సరాలు, మేనేజర్ పోస్టులకు 16 సంవత్సరాల అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

జీతభత్యాలు..

➥ అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఏడాదికి రూ.16.24 లక్షలు (పే స్కేలు రూ.50,000 – రూ.1,60,000) ఉంటుంది.

➥ డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.19.49 లక్షలు (పే స్కేలు రూ.60,000 – రూ.1,80,000) ఉంటుంది.

➥ మేనేజర్, అడిషనల్ సీఎంవో పోస్టులకు ఏడాదికి రూ.22.74 లక్షలు (పే స్కేలు రూ.70,000 – రూ.2,00,000) ఉంటుంది.

➥ సీనియర్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.25.99 లక్షలు (పే స్కేలు రూ.80,000 – రూ.2,20,000) ఉంటుంది.

➥ చీఫ్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.29.24 లక్షలు (పే స్కేలు రూ.90,000 – రూ.2,40,000) ఉంటుంది.

➥ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.32.49 లక్షలు (పే స్కేలు రూ.1,00,000 – రూ.2,60,000) ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.03.2024.

➥ దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది: 27.03.2024.

➥ సుదూరప్రాంత అభ్యర్థులు దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది: 03.04.2024

 

Notification

Website 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…



Source link

Related posts

నేను చేసేది నటనే…నా ముఖం బాగుంది

Oknews

Revanth Reddy : 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ ఫేజ్-2, రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో 5 లక్షల ఉద్యోగాలు- సీఎం రేవంత్ రెడ్డి

Oknews

MP Raghurama Actor Ram charan wishing BRS MP Vaddiraju Ravichandra

Oknews

Leave a Comment