Latest NewsTelangana

Singareni Collieries Company Limited SCCL has released notification for the recruitment of management trainee and other posts check details here


Singareni Collieries Company Recruitment: సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 272 ఉద్యోగాల భర్తీకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(మైనింగ్‌)-139 పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ)-22 పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (పర్సనల్‌)-22 పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ)-10 పోస్టులు, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌-10 పోస్టులు; మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో జియాలజిస్ట్‌)- పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌)-18 పోస్టులు, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌- 03 పోస్టులు, జనరల్‌ డిప్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (జీడీఎంవోస్‌)-30 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీర్‌ ట్రైనీ (సివిల్‌) ఈఅండ్‌ఎస్‌ గ్రేడ్‌-సీలో 16 పోస్టులను భర్తీచేయనున్నారు.

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మార్చి 1న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థుల నుంచి మార్చి 18న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ మార్చి 1 నుంచి అందుబాటులో ఉండనుంది.

వివరాలు..

* ఖాళీల సంఖ్య: 272 (ఎగ్జిక్యూటివ్ కేడర్-156, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్-16)

I. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు

1) మేనేజ్‌మెంట్ ట్రైనీ (E2 గ్రేడ్): 139 పోస్టులు

విభాగం: మైనింగ్.

2) మేనేజ్‌మెంట్ ట్రైనీ (E2 గ్రేడ్): 22 పోస్టులు

విభాగం: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్.

3) మేనేజ్‌మెంట్ ట్రైనీ (E2 గ్రేడ్): 22 పోస్టులు

విభాగం: పర్సనల్.

4) మేనేజ్‌మెంట్ ట్రైనీ (E2 గ్రేడ్): 22 పోస్టులు

విభాగం: ఐఈ.

5) జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ (E1 గ్రేడ్): 10 పోస్టులు

6) మేనేజ్‌మెంట్ ట్రైనీ (E2 గ్రేడ్): 02 పోస్టులు

విభాగం: హైడ్రో-జియాలజిస్ట్.

7) మేనేజ్‌మెంట్ ట్రైనీ (E2 గ్రేడ్): 02 పోస్టులు

విభాగం: సివిల్.

8) జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ (E1 గ్రేడ్): 03 పోస్టులు

9) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (E3 గ్రేడ్): 30 పోస్టులు

II. నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు

10) సబ్-ఓవర్సీర్ ట్రైనీ, టి & ఎస్‌ (గ్రేడ్-సి): 16 పోస్టులు

సివిల్: సివిల్.

అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. 

వయోపరిమితి: అభ్యర్థుల వయసు గరిష్ఠంగా 30 సంవత్సరాలకు మించకూడదు. అయితే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (జీడీఎంవో) పోస్టులకు 45 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్లపాటు వయో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.03.2024.

Website

Singareni Jobs: సింగేరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా

ALSO READ:

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో 27 ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెషనల్స్ పోస్టులు, వివరాలు ఇలా
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 27 అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, అడిషనల్ సీఎంవో పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో సరైన అర్హతలు, అనుభవం ఉన్న సీనియర్ ప్రొఫెషల్స్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈపోస్టుల భర్తీకి ఫిబ్రవరి 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…



Source link

Related posts

గేమ్ ఆఫ్ థ్రోన్స్ అర్ధమయ్యింది కానీ… గామి అర్ధం కాలేదు!

Oknews

Telangana Police Seized Rs.243 Crore Worth Cash And Gold Till Now

Oknews

congress may announce candidates list on March 7 says CM Revanth Reddy | Revanth Reddy Chit Chat: మార్చి 7న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

Oknews

Leave a Comment