ByGanesh
Fri 23rd Feb 2024 10:01 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యి ఈ ఏప్రిల్ 5 కి రిలీజ్ అవుతుంది అనుకుంటే.. అది కాస్తా అక్టోబర్ కి వెళ్ళిపోయింది. మరి సలార్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మార్చి లేదా మే నుంచి NTR31 ని సెట్స్ మీదకి తెలుసుకెళతాడని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్-కొరటాల శివ దేవర షూటింగ్ పూర్తవ్వలేదు. మరోపక్క హ్రితిక్ రోషన్ కొద్దిరోజుల్లో వార్ 2 తో సెట్స్ మీదకి వెళ్ళిపోతున్నట్లుగా అప్ డేట్ వదిలారు. ఈలెక్కన ఎన్టీఆర్ దేవర సెట్స్ నుంచి వార్2 సెట్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.
మరి ఇదంతా జరిగితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం వెయిట్ చెయ్యక తప్పదు. అంటే ఇప్పుడప్పుడే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ సెట్స్ మీదకి వెళ్ళదు. ముందుగా దేవర, తర్వాత వార్ 2 ఆ తర్వాతే NTR31 అన్నట్టుగా ఎన్టీఆర్ ముందు టార్గెట్ కనబడుతుంది. ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత సైలెంట్ గానే ఉంటున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడు ఫ్రీ అవుతాడా అని ఎదురు చూస్తున్నారు. మరి ఈ సమయంలో ఆయన NTR31 స్క్రిప్ట్ తో పాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటారు కావొచ్చు.
NTR 31 update :
NTR-Prashanth Neel NTR31 update