Health Care

ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వంట.. ఆరోగ్యానికి మంచిదేనా?


దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అందరూ ఎలక్ట్రిక్ కుక్కర్‌లో‌నే వంటచేస్తున్నారు. అయితే చాలా మందిలో ఓ డౌట్ ఉంటుంది. కుక్కర్‌లో వంట చేయడం అసలు ఆరోగ్యానికి మంచిదేనా? లేకపోతే ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అని?

పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మలు ఎక్కువగా కట్టెల పొయ్యి మీదనే వంట చేసేవారు. ఇక తర్వాత మన అమ్మవారు, గ్యాస్ మీద వంట చేయడం మొదలు పెట్టారు. ఇక ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పుడున్నవారందరూ, కుక్కర్‌ మీదనే ఎక్కువగా వంట చేస్తున్నారు. అయితే కుక్కర్ మీద వంటతో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నష్టాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

మనం క్రమం తప్పకుండా కుక్కర్‌లో వంట చేసుకుంటూ తినడం వలన క్యాన్సర్, వంధ్యత్వం, నాడీ వ్యవస్థలో లోపాలు వంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు. అంతే కాకుండా కుక్కర్‌లో వంట చేయడం వలన అది ఆహార పదార్థాల పోషక విలువలను తగ్గించడమే కాకుండా,ఖనిజాల శోషణను నిరోధిస్తుందంట. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అంటున్నారు వైద్యులు.



Source link

Related posts

ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే మీ లివర్ చెడిపోయినట్లే!

Oknews

ఎదుటి వ్యక్తి మిమ్మల్ని వెంటనే ఇష్టపడాలా? అయితే ఈ టిప్స్ ఫాలో అవండి..

Oknews

పెళ్లి కాకుండా ప్రసూతి సెలవులు పొందవచ్చా?

Oknews

Leave a Comment