Andhra Pradesh

ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షకు విస్తృత ఏర్పాట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాలు ఏర్పాటు-amaravati news in telugu appsc group 2 screening exam preparations 1327 centers ready ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో గ్రూప్-2 రాత పరీక్షలు(APPSC Group 2 Exam ) జరుగనున్నాయని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10.30.గం.ల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు నిరంతర పర్యవేక్షణకు 24 మంది ఐఏఎస్ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను నియమించామని సీఎస్ పేర్కొన్నారు. అదే విధంగా 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8500 ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు. అంతేగాక విస్తృత బందోబస్తు చర్యల్లో భాగంగా 3971 మంది పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు కాన్ఫిడెన్సియల్ మెటీరియల్ నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించామని తెలిపారు. అలాగే మొత్తం పరీక్షల తీరును ఏపీపీఎస్సీ నుంచి 51 మంది అధికారులు పర్యవేక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు.



Source link

Related posts

AP Teachers Transfer: ఉపాధ్యాయుల బ‌దిలీలు ర‌ద్దు

Oknews

Mystery Box : విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన పురాతన పెట్టె

Oknews

AP Inter Results 2024 : ఏపీ ఇంటర్ ఫలితాలు

Oknews

Leave a Comment