దిశ, ఫీచర్స్ :భారత దేశం ఆచార సంప్రదాయాలకు పెట్టింది పేరు. పూరాత కాలం నుంచి మన పెద్దవారు పాటించిన ప్రతీది, ఇప్పటి వారు కూడా పాటిస్తున్నారు.ఇక సోషల్ మీడియా వచ్చాక మనం చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా ఇతర ప్రాంతాలలోని ఆచార సంప్రదాయాల గురించి తెలుసుకోవడం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇలా కూడా ఉంటుందా అని,షాకింగ్‌గా అనిపిస్తుంది.
అయితే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలో ఓ వింత ఆచారం ఉంది. రాష్ట్రంలోని సుందరమైన ప్రకృతి అని పిలవబడే గ్రామంలో మహిళలు ఐదు రోజుల పాటు నగ్నంగా ఉంటారంట.వీరు ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదురోజుల పాటు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఉంటారంట. ఆ సమయంలో అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటారని చెబుతున్నారు అక్కడి వారు. అయితే పూర్వకాంలో ఆ గ్రామస్తులను. లహువా ఘోండ్ అనే దేవత రాక్షసులను నుంచి కాపాడటంతో ఈ సంప్రదాయం మొదలైందంట. ఆనాది కాలం నుంచి ఇప్పటి వరకు ఇది ఇలానే కొనసాగుతుంది అంటున్నారు అక్కడి గ్రామస్థులు.