ByGanesh
Sat 24th Feb 2024 08:09 PM
దర్శకుడు శంకర్ కమల్ హాసన్ తో చేస్తున్న క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 షూటింగ్ పూర్తవడంపై ఎలాంటి అప్ డేట్ లేకపోయినా.. ఆల్మోస్ట్ శంకర్ ఇండియన్ 2 షూటింగ్ ముగింపుపలికారనే మాట వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శంకర్ ఓ వైపు ఇండియన్ 2 కంప్లీట్ చేస్తూనే మరో వైపు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. దాని కోసమే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఇవ్వలేక సతమతమవుతున్నారు.
ఇండియన్ 2 రిలీజ్ పై కమల్ అభిమానులు, గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై మెగా ఫాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. అయితే శంకర్ మే నెలలో ఇండియన్ 2 చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది, అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంటున్నారు. మంచి ముహూర్తం చూసి ఇండియన్ 2 తేదీపై స్పష్టత ఇవ్వబోతున్నారని అంటున్నారు. మరి మే రిలీజ్ అంటే.. ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వకుండా ఉంటే పబ్లిసిటీ పనులకి సమయం దొరకడమేమో కానీ.. మిగతా భాషల నుంచి ఎలాంటి పోటీ లేకుండా చూసుకోవాలి.
ఎటు చూసినా కానీ ఇండియన్ 2 సమ్మర్ రిలీజ్ అంటూ స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇండియన్ 2 సమ్మర్ అయితే గేమ్ ఛేంజర్ అక్టోబర్ కాని డిసెంబర్ కానీ రిలీజ్ ఉండచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Strong buzz on Indian 2 release:
Indian 2 Release Date Buzz Grows Stronger