Kamareddy Crime : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి లక్ష్మీపతి (55) బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులకు, తెలిసిన వారికి అడిగిన ఆచూకీ తెలియలేదు. దీంతో గ్రామంలో, గ్రామ పరిసర ప్రాంతంలో వెతుకుతున్న సమయంలో సొంత పొలం వద్ద చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. లక్ష్మీపతి భార్య లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కొండ విజయ్ తెలిపారు. రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Source link
previous post