ఉద్యోగ విరమణ డబ్బులతో రిటైర్మెంట్ జీవితాన్ని పదిలం చేసుకుందామనుకునే వారికి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లల పెళ్లిళ్లు, ఆరోగ్యం, వైద్య చికిత్సలు, ఉన్నత విద్య వంటి ఖర్చుల కోసం చేతికి డబ్బులు అందే పరిస్థితులు లేవని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి నిర్దిష్ట హామీ, ప్రకటన కూడా వెలువడటం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.