ByGanesh
Sun 25th Feb 2024 10:31 AM
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి అడుగుపెట్టబోతున్న జాన్వీ కపూర్ ఈ మధ్యన సౌత్ ముచ్చట్లు ఎక్కువ చెబుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సౌత్ కి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ తర్వాత వెంటనే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ఛాన్స్ అందుకుంది. మరి ఎన్టీఆర్-రామ్ చరణ్ లు గ్లోబల్ స్టార్స్. మొదట్లోనే ఆమె ఇలాంటి పెద్ద హీరోల ఛాన్స్ లు అందుకోవడంతో అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. అటు తమిళ్ లోను సూర్య కర్ణ తో ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుంది.
ఎన్టీఆర్ దేవర సెట్స్ లో ఎంతో ఎగ్జైట్ అవుతున్నట్టుగా, ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చెయ్యడం పట్ల ఫీలింగ్ హ్యాపీ అని చెబుతుంది జాన్వీ కపూర్. తాజాగా జాన్వీ కపూర్ తెలుగులో నటించడంపై మరోసారి స్పందించింది. తనకు తెలుగులో నటించడం ద్వారా మూలలను వెతుక్కున్నట్టుగా అనిపిస్తుంది, తాను ఇప్పుడు తెలుగు భాషని కూడా నేర్చుకుంటున్నట్లుగా చెప్పింది. తనకి ఇండియన్ సినిమా, అలాగే క్రికెట్ అంటే చాలా ఇష్టమని. అందులోను విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ లు అంటే బోలెడంత ఇష్టమని చెప్పిన జాన్వీ కపూర్.. తాను నార్త్ నుంచి సౌత్ లో కూడా నటించడం చూసాక నా లైఫ్ గుండ్రంగా తిరిగినట్లుగా అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది.
Janhvi Kapoor Favourite Cricketers:
Virat Kohli and Dinesh Karthik are my favourite Cricketers: Janhvi Kapoor