TS Inter Hall Tickets Download : తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు(TS Inter Hall Tickets) ఆన్ లైన్ లో విడుదల చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ఇప్పటి వరకు కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ కు అవకాశం ఇచ్చింది. తాజాగా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సవర పరీక్షలు జరుగనున్నాయి. ఈ ఏడాది 9.8 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.
Source link