గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గురువారం (ఫిబ్రవరి 22) తన ఫ్లాట్‌లో గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. తన సోదరుడిని ఓ యువతి ప్రేమ విషయంలో విచారించడానికి వెళ్లిన నార్సింగి పోలీసులకు గంజాయితో షణ్ముఖ్ దొరికాడు. దాంతో షణ్ముఖ్‌ను, అతని సోదరుడు సంపత్ వినయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత షణ్ముఖ్ గంజాయి సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు సమాచారం వచ్చింది. అయితే బెయిల్‌పై షణ్ముఖ్ జశ్వంత్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర తన్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఆ ఫొటోలో కేవలం షణ్ముఖ్ మాత్రమే ఉన్నాడు. అతని సోదరుడు సంపత్ వినయ్ కనిపించలేదు. దీంతో అతనికి బెయిల్ వచ్చిందా? లేదా? అనేది స్పష్టత రాలేదు. అయితే, షణ్ముఖ్ జశ్వంత్‌పై ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనే తదితర విషయాలపై నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ క్లారిటీ ఇచ్చారు.
Source link