అనంతరం వారిని విచారించగా వారికి టెలిగ్రామ్ యాప్ (Telegram app)ద్వారా దుబాయ్(Dubai) కి చెందిన రసూల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని….. రసూల్ రోజు మూడు నుంచి నాలుగు యూఎస్ డాలర్లు పంపిస్తానని వాటిని ఇండియన్ కరెన్సీ లోకి మార్చి పంపాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రసూల్ సూచన మేరకు కాసెస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతూ కాజేసిన నగదును వీరిద్దరూ రసూల్ ఖాతాకు బదిలీ చేసేవారు. ఇందుకు గాను రసూల్ వారికి మూడు శాతం కమిషన్ గా ఇచ్చేవాడు. ఇదే తరహాలో నిందితులు భారీ మోసాలకు పాల్పడినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వీరు దేశవ్యాప్తంగా 50 కేసుల్లో తమ ఖాతాలను వినియోగించుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు, మూడు పెన్ డ్రైవ్లు, ఏడు బ్యాంకు పాస్ బుక్ లు, 33 చెక్ బుక్స్, 25 డెబిట్ కార్డులు, ఆఫీస్ స్టాంప్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Source link