Entertainment

ధోని, పవన్ కళ్యాణ్ ఒకటే..అందుకే 2019 లో గెలిపించలేదంటున్న హైదర్ ఆది


జబర్దస్త్ కామెడీ షో ద్వారా  అశేష తెలుగు ప్రజలని నవ్వుల్లో  ముంచెత్తిన   కమెడియన్ హైపర్ ఆది.

ఆయన వేసే పంచ్ లకి నవ్వని తెలుగు వాడు ఉండడంటే అతిశయోక్తి కాదు.  కొంత కాలం నుంచి సినిమాల్లోను బిజీ అవుతు వస్తున్న ఆది తాజాగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కీలక  వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు  రెండు తెలుగు రాష్ట్రాల్లో హీట్ ని రాజేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో  జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తన మిత్రపక్షమైన తెలుగుదేశంతో కలిసి 24 అసెంబ్లీ స్థానాలు మూడు ఎంపి స్థానాల్లో పోటీ చేయబోతుంది. దీంతో  పవన్ కళ్యాణ్ తన కులాన్ని చంద్రబాబుకి   తాకట్టుపెట్టాడని, ప్యాకేజీ తీసుకున్నాడని ప్రతిపక్షం నుంచి స్వపక్షం లోని కొంత మంది నుంచి  విమర్శలు వస్తున్నాయి. వీటిపై ఆది తనదైన రీతిలో స్పందించాడు.  కొంత మంది సొంత పార్టీ వాళ్ళు  పవన్ కళ్యాణ్‌ గారిని తిడుతున్నారని  అలా తిట్టేవాళ్ళు  తమ  ఆత్మసాక్షిగా ఆలోచించి తనని నమ్ముకున్న వారిని  మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్‌గారికి ఉంటుందేమో  ఆలోచించాలని చెప్పాడు. సీట్లు తీసుకున్న విషయంలో  పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్  ఎంత ఆలోచిస్తాడు. ఆ విషయంలో  తనలో తాను ఎంత మదనపడి ఉంటాడో కూడా  ఒక్కసారి ఆలోచించాలని చెప్పాడు

అలాగే ఇప్పుడు  24 సీట్లే ఏంటని  అడుగుతున్న వాళ్ళు  2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ గారిని  గెలిపించలేదు.చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే ఇంట్లో నుంచి బయటకి వెళ్లలేం.అలాంటిది  రెండుచోట్ల ఓడిపోయినా కూడా ప్రజా సమస్య అనగానే అక్కడకి వెళ్లి పవన్  ఆ సమస్యని తీర్చాడు. తన పిల్లల కోసం బ్యాంక్‌లో దాచిన డబ్బుని తీసి కౌలు రైతులకు సాయం చేసాడు. దేశ రాజకీయాల్లో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు  కానీ పవన్ కళ్యాణ్‌ గారిలా సొంత డబ్బుతో  సాయం చేసేలా  ఎవరైనా ఉన్నారా అని  ఆది చెప్పుకొచ్చాడు. అలాగే ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ధోనితో  పవన్‌ని పోల్చాడు. క్రికెట్ లోకి  వచ్చిన కొత్తలో డకౌట్ అయిన ధోని ఆ తరువాత  గేమ్ ఛేంజర్ గా మారాడు. అటుపై  గేమ్ విన్నర్ అయ్యి క్రికెట్‌నే శాసించే వాడయ్యాడు  పవన్ కళ్యాణ్ కూడా ఒక రోజు రాజకీయాలని శాసించే స్థాయికి ఎదుగుతాడు అని చెప్పాడు. దయచేసి శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడద్దని జన సైనికుల్ని ఆది వేడుకున్నాడు.

 



Source link

Related posts

ప్రభాస్ వారసుడు గౌడ్ సాబ్ ఎంట్రీ

Oknews

‘పేక మేడలు’ మూవీ రివ్యూ

Oknews

నేను సింగిల్‌‌గానే వుండను… నా వయసు 30 సంవత్సరాలే!

Oknews

Leave a Comment