EntertainmentLatest News

దిల్ రాజు కొత్త సినిమా.. దానికి కాపీనా..?


కొన్ని సినిమాలు టైటిల్, పోస్టర్ తోనే కథ ఎలా ఉండబోతుందో చెప్పేస్తాయి. తాజాగా దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తున్న ఒక కొత్త సినిమా కూడా పోస్టర్ తోనే కథ చెప్పేసింది. అయితే ఆ కథ ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఓ సినిమాకి కాపీ అనే అభిప్రాయం కలుగుతోంది.

దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న మూడో సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను తాజాగా రివీల్ చేశారు. ఈ సినిమాకి ‘లవ్ మీ’ అనే టైటిల్ పెట్టారు. “If you dare” అనేది క్యాప్షన్. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. హీరో చిరునవ్వుతో నడుచుకుంటూ వస్తుంటే.. దెయ్యం రూపంలో ఉన్న హీరోయిన్ గాలిలో తేలుతూ అతని వెనుక వస్తున్నట్టుగా ఉంది. అలాగే పోస్టర్ మీద ‘ఘోస్ట్ లవ్’ అని రాసుంది. మొత్తానికి టైటిల్, పోస్టర్ ని బట్టి చూస్తుంటే.. “నీకు ధైర్యముంటే.. నన్ను ప్రేమించు” అని హీరో వెంట దెయ్యం పడుతున్నట్టుగా కథ ఉండబోతుందని అర్థమవుతోంది. 

అయితే ఈ తరహా కథతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా నిఖిల్ హీరోగా నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా'(2016) సినిమా కథ ఇలాగే ఉంటుంది. అందులో హీరోని ఎంతగానో ప్రేమించి, అనుకోకుండా చనిపోయిన హీరోయిన్.. ఆత్మలా మరి ఇతరుల శరీరంలో ప్రవేశించి ప్రేమ పేరుతో హీరో వెంట పడుతుంది. మరి ‘లవ్ మీ’ చిత్ర కథ కూడా అలాగే ఉంటుందా లేక ఏదైనా కొత్త పాయింట్ తో వస్తుందా అనేది.. టీజర్, ట్రైలర్ విడుదలైతే క్లారిటీ వచ్చే అవకాశముంది.



Source link

Related posts

నేచురల్ స్టార్‌తో అదితీ రొమాన్స్

Oknews

‘ఇండియన్‌ 2’పై శంకర్‌ క్రేజీ అప్డేట్‌

Oknews

The sentiment of not leaving TDP.. ! టీడీపీని వీడని సెంటిమెంట్.. !

Oknews

Leave a Comment