Latest NewsTelangana

Intermediate Exams in Telangana From today tsbie sets all arrangements


TS Inter Exams: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం(ఫిబ్రవరి 28) నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం నుంచి 4,78,718 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. ద్వితీయ సంవత్సరం నుంచి 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. సెకండియర్‌ పరీక్షలకు హాజరయ్యే వారిలో 58,071 మంది ప్రైవేట్‌ విద్యార్థులున్నారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు తెలిపారు.  పరీక్ష రాసే అబ్బాయిలు రాయితీ బస్‌ పాస్‌, హాల్‌టికెట్‌ చూపిస్తే ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విద్యార్థులు వారి సెంటర్లను సులువుగా చేరుకునేందుకు ఇంటర్‌ బోర్డు వారు సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ ప్రవేశపెట్టారు. అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు 14416 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. 

పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 సెంటర్లను అధికారులు ఏర్పాటుచేశారు. వీటిలో 880 సెంటర్లను ప్రైవేట్‌ కాలేజీల్లో, 407 సెంటర్లను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో, మరో 234 సెంటర్లను గురుకులాల్లో ఏర్పాటు చేశారు. ఇక పరీక్షల కోసం 27,900 మంది ఇన్విజిలేటర్లు,  విధులు నిర్వర్తించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, సిబ్బందిని పరీక్షల విధుల్లోకి తీసుకొంటున్నట్టు వివరించారు. కలెక్టర్లు, పోలీసు అధికారులు పరీక్షాకేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు-1,521 మంది; ఫ్లయింగ్‌ స్కాడ్‌-75 మంది; సిట్టింగ్‌ స్కాడ్‌ – 200 మంది విధులు నిర్వహించనున్నారు.

విద్యార్థులకు కీలక సూచనలు..

➥ ఇంటర్‌ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.

➥ సెల్‌ఫోన్లపై కఠిన ఆంక్షలు విధించారు. 

➥ మాల్‌ ప్రాక్ట్రీస్‌, కాపీయింగ్‌ను ప్రోత్సహించిన యాజమాన్యాలపై సెక్షన్‌ -25 ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటారు.

➥ ప్రతీ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుంది. 

వెబ్‌సైట్‌లో ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లు..
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండో ఏడాది వారు మొదటి సంవత్సరం లేదా రెండో ఏడాది హాల్‌టికెట్ నంబరుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి, సరిచేయించుకునే వెసులుబాటు ఉంటుంది.

Inter First Year Hallticket

Inter Second Year HallTicket

Inter Bridge Course HallTicket

ఇంటర్ పరీక్షల షెడ్యూలు..

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు..

➥ 28-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I

➥ 01-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-I

➥ 04-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IA, బాటనీ పేపర్‌-I, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I

➥ 06-03-2024: మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IB, జువాలజీ పేపర్‌-I, హిస్టరీ పేపర్‌-I

➥ 11-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-I, ఎకనామిక్స్‌ పేపర్‌-I

➥ 13-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-I, కామర్స్‌ పేపర్‌-I

➥ 15-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I

➥ 18-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జియోగ్రఫీ పేపర్‌-I

ఇంటర్‌ సెకండ్‌ పరీక్షలు..

➥ 29-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II

➥ 02-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-II

➥ 05-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II

➥ 07-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II

➥ 12-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II

➥ 14-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II

➥ 16-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II

➥ 19-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జియోగ్రఫీ పేపర్‌-II  

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...



Source link

Related posts

MLC Kavitha Jagtial Councillors step back over no confidence motion on Vice chairman

Oknews

కేసీఆర్.. బట్టలు తెచ్చుకోండి… తలుపులు మూసి ఎంతసేపైనా చర్చిద్దాం | ABP Desam

Oknews

భర్తకి హార్ట్ ఎటాక్.. వైరల్ గా మారిన నటి సనా పోస్ట్!

Oknews

Leave a Comment