GossipsLatest News

Crores spent for crucial scene in Pushpa 2 పుష్ప2 లో ఆ సీన్ కి థియేటర్స్ బ్లాస్ట్



Wed 28th Feb 2024 09:38 AM

pushpa 2  పుష్ప2 లో ఆ సీన్ కి థియేటర్స్ బ్లాస్ట్


Crores spent for crucial scene in Pushpa 2 పుష్ప2 లో ఆ సీన్ కి థియేటర్స్ బ్లాస్ట్

పుష్ప ద రైజ్ కి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప ద రూల్ పై ప్యాన్ ఇండియా మార్కెట్ లో విపరీతమైన క్రేజ్, బజ్ క్రియేట్ అయ్యాయి. అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో ఆగష్టు 15 న రాబోతున్న పుష్ప పార్ట్ 2 పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం విరామమే లేకుండా రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ గా వేసిన సెట్ లో పుష్ప 2 చిత్రీకరణ చేపట్టారు సుకుమార్. పుష్ప 2 లో ఏ సీన్ కా సీన్ అభిమానులని మాత్రమే కాదు, మాస్ ఆడియన్స్ ని విజిల్స్ కొట్టించేవిలా తెరకెక్కిస్తున్నారట.

అందులో ఇంటర్వెల్ బ్యాంగ్ నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు టాక్. ఇంటర్వెల్ బ్యాంగ్ లోనే 25 నిమిషాల పాటు జాతరకు సంబంధించిన క్రేజీ ఎపిసోడ్ షూట్ ని చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 25 నిమిషాల పాటు ఉండే ఆ ఎపిసోడ్ కోసం చిత్ర బృందం 30 రోజులకు పైగానే కష్టపడ్డట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాల కోసం మేకర్స్ దాదాపు 50 కోట్ల రేంజ్ లో ఖర్చు చేసినట్లుగా సమాచారం. ఈ సన్నివేశాలు థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తాయంటున్నారు.

అంతేకాకుండా జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ అర్ధనారీశ్వరి అవతారంలో విలన్స్ ను ఊచకోత కోయడమే కాకుండా అమ్మవారి ఉగ్రరూపంతో స్టెప్పులు వేస్తూ పూనకాలు తెప్పిస్తానంటూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న వార్తలకి అల్లు అర్జున్ ఫాన్స్ రెచ్చిపోయి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సీన్ లో అల్లు అర్జున్ హీరోయిజం మొత్తం చూపిస్తాడని, సుకుమార్ అల్లు అర్జున్ కేరెక్టర్ ని పూర్తిగా ఎలివేట్ చేస్తారని అంటున్నారు. మరి ఈ సీన్స్ కి సంబందించిన న్యూస్ చూస్తే అవి థియేటర్స్ ని బ్లాస్ట్ చేసేలా ఉన్నాయిగా..!


Crores spent for crucial scene in Pushpa 2:

Pushpa 2 Team Spending A Bomb On An Action Sequence!









Source link

Related posts

Todays top ten news at Telangana Andhra Pradesh 18 february 2024 latest news | Top Headlines Today: హింసాత్మక ఎన్నికలను కోరుకుంటున్నారా?; మేడారం జాతరపై స్పెషల్ ఫోకస్

Oknews

Supreme Court notices to Revanth Reddy in cash for vote case

Oknews

Kavitha Arrested కవిత అరెస్ట్.. గులాబీ పార్టీలో గుబులు!

Oknews

Leave a Comment