Health Care

ఖర్జూరంతో విద్యుత్ తయారీ.. వాహ్‌వా అనిపించిన ముగ్గురు ఇంజనీర్లు!


దిశ, ఫీచర్స్: ‘మినరల్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం’ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఖర్జూరం తినడం వల్ల బహిష్టు సమయంలో వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలు నిద్రలో మూత్ర విసర్జన చేస్తుంటే ఖర్జూరంతో పాటు పాలు ఇస్తే ఈ సమస్యను దూరం చేయొచ్చు. ఖర్జూరంతో కాచిన పాలను ఉదయం, సాయంత్రం తాగితే రక్తపోటు ను నివారించవచ్చు.

ఇవి గ్రామాల్లో నేరుగా చెట్ల నుంచి తీసుకొని తింటారు. పట్టణ, నగరాల్లో ప్రజలు కొనుక్కుని మరీ రోజూ వారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే ఇన్ని ప్రయోజనాలున్న ఖర్జూరతో యూఏఈకి చెందిన ముగ్గురు ఇంజనీర్లు ఓ అద్భుత ప్రయోగం చేశారు. ఏకంగా కరెంట్‌నే సృష్టించారు. అవును మీరు విన్నది నిజమే. వివరాల్లోకెళ్తే.. ఎమిరాటీ ఇంజనీర్లు, కళాకారుల బృందం.. డాక్టర్‌ అల్‌ అత్తర్‌, ఒమర్‌ అల్‌ హమ్మది, మహమ్మద్‌ అల్‌ హమ్మదీ అనే ముగ్గురు సాంప్రదాయమైన మజ్దూల్‌ ఖర్జూరాలను ఉపయోగించి కరెంట్ తయారు చేశారు.

పరిణామంలో చిన్నగా ఉండే ఖర్జూరంలో రాగి పలకలను పొందుపరిచి.. వీటిని వాహక లోహపు తీగతో అనుసంధానించారు. ఈ ప్రయోగం కోసం వీరు మోడల్ 20 ఖర్జూరాలను ఉపయోగించారట. మోడైల్ వైర్స్ సర్క్యూట్ ను కంప్లీట్ చేస్తున్నప్పుడు రాగి ప్లేట్లు ఎలక్ట్రోడ్‌లుగా పనిచేస్తాయట. ఇక సెటప్ చిన్న మొత్తంలో కరెంట్‌ను ఉత్పత్తి చేయడానికి అనుమతించిందట.

డాక్టర్‌ అల్‌ అత్తర్‌, ఒమర్‌ అల్‌ హమ్మది, మహమ్మద్‌ అల్‌ హమ్మదీ మాట్లాడుతూ.. ఖర్జూరంలో దాగున్న మరికొన్ని లక్షణాలను కనుగొనే క్రమంలో ఈ ప్రయోగం చేయాలని అద్భుతమైన వచ్చిందని వెల్లడించారు. సిక్కా ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ ఫెస్టివల్‌లో ముగ్గురు తమ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు.

 



Source link

Related posts

కింద పడుకొని ఆ యువతి చేసిన పనికి తట్టుకోలేకపోతున్నాం.. నెటిజన్ల రియాక్షన్ ఇదే.. (వీడియో)

Oknews

బెస్ట్ ఫ్రెండ్స్‌తో ఈ విషయాలు పంచుకుంటున్నారా? బీ కేర్ ఫుల్..!!

Oknews

రూ. 31 కోట్ల విలువైన ఇల్లు.. కేవలం 1000 రూపాయలకే.. ఎక్కడో తెలుసా

Oknews

Leave a Comment