తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలని ప్రేక్షకులకి అందించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఆయన టేకింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగులో కూడా ఘర్షణ, ఏ మాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో, ఎటో వెళ్ళిపోయింది మనసు లాంటి సినిమాలకి దర్శకత్వం వహించాడు. లేటెస్ట్ గా జోషువా అనే మూవీ విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ తన స్వీయ దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం అనే సినిమాని తెరకెక్కించాడు.అంటే తనే నిర్మాతగా మారి ఆ సినిమాని నిర్మించాడు. కానీ ఆర్ధిక ఇబ్బందుల వలన రిలీజ్ ఆగిపోయింది. ఇప్పడు ఆ విషయం గురించి గౌతమ్ మరో సారి తన బాధని బయటపెట్టాడు. ధ్రువనక్షత్రం రిలీజ్ వాయిదా పడుతు ఉండటం చాలా బాధ కలిగిస్తుందని కొన్ని సార్లు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తుందని కానీ పెట్టుబడిదారులకి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా అని ఆయన అన్నాడు. అలాగే అలాగే నా భార్య నెలరోజులుగా ఎంతో మానసిక వేదన అనుభవిస్తు ధ్రువ నక్షత్రం గురించే ఆలోచిస్తుందని చెప్పాడు.ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
2016 వ సంవత్సరంలోనే ధ్రువ నక్షత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. గత ఏడాది నవంబర్ లో విడుదల చెయ్యాలని భావించినా కూడా కుదరలేదు. ఇంతకీ వాయిదా పడటానికి అసలు కారణం ఏంటంటే గౌతమ్ గతంలో శింబు హీరోగా సూపర్ స్టార్ అనే సినిమాని తెరకెక్కిస్తానని ఆల్ ఇన్ పిక్చర్స్ అనే సంస్ధతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. పైగా గౌతమ్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. ఈ విషయంపైనే హైకోర్ట్ లో పిటిషన్ దాఖలయ్యింది. దాంతో ధ్రువ నక్షత్రం వాయిదా పడుతూ వస్తుంది. రేపు మార్చి 1 న ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జోషువా విడుదల కానుంది. నటుడుగా గాను ప్రాధాన్యమున్న పాత్రలని పోషిస్తున్నారు.