నా నిర్ణయాలు రాష్ట్ర లబ్దికోసమే
4 దశాబ్దాల రాజకీయ ఉద్దండుడైన చంద్రబాబును జైలులో పెడితే బాధ కలిగిందని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అన్నారు. తాను ఒక్కడినే అని చెప్పుకుంటున్న సీఎం జగన్ తనకున్న ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఫాంహౌస్‌లో ఇల్లు కట్టుకున్నప్పట్నుంచి జగన్ బతుకు తనకు తెలుసన్నారు. తన నిర్ణయాలు పార్టీ, వ్యక్తిపరంగా ఉండవని, రాష్ట్ర లబ్ధికోసమే ఉంటాయన్నారు. టీడీపీ-జనసేన సహకరించుకుంటూనే ప్రజల భవిష్యత్తు బాగుంటుందన్నారు. కోట్లు సంపాదించే స్కిల్స్ ఉన్నా వాటిని వదులుకుని ప్రజల భవిష్యత్తు కోసం వచ్చాన్నారు. సినిమాల్లో వచ్చే డబ్బును ఇంట్లో బియ్యం కొనకుండా, హెలికాప్టర్లకు వెచ్చించి ప్రజల కోసం వస్తున్నానని పవన్ అన్నారు. సిద్ధం అంటున్న జగన్‌కు యుద్ధం ఇస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు ఇలా ప్రతీ వర్గాన్ని మోసం చేశారన్నారు. అన్ని వర్గాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.