EntertainmentLatest News

వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సినిమా టైటిల్ ఇదేనా! ఫ్యాన్స్ హుషారు


  

రెండున్నర దశాబ్దాలుగా తెలుగు సినిమా ప్రేక్షకులని తన నటనతో అలరిస్తు వస్తున్న హీరో విక్టరీ వెంకటేష్.తెలుగు సినిమా పరిశ్రమలో మరే ఇతర హీరోకి లేనన్ని హిట్ లు ఆయనకి ఉన్నాయి. అందుకే అయన ముందు విక్టరీ వచ్చి చేరింది. మొన్న సంక్రాంతికి సైంధవ్ తో వచ్చాడు. టాక్ ఎలా ఉన్నా కూడా వెంకటేష్ పెర్ఫార్మెన్స్ కి  మంచి పేరే వచ్చింది. తాజాగా  తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన టైటిల్ ఒకటి సినీ ప్రేమికులని కట్టిపడేస్తుంది.

 వెంకటేష్ తన నెక్స్ట్ మూవీని హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తో చేయనున్నాడనే వార్తలు గత కొంత కాలం నుంచి వస్తున్నాయి. దాదాపుగా ఈ కాంబో ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. ఇప్పుడు ఆ మూవీకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో మేకర్స్  ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక వేళ అదే టైటిల్ ని  ఫిక్స్ అయితే కనుక ఇక ఆ మూవీ సంచలన విజయాన్ని సాధించినట్టే. ఎందుకంటే వెంకటేష్ లాంటి ప్యూర్ ఫ్యామిలీ స్టార్ ఆ టైటిల్ తో సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం.పైగా  తెలుగు వారి పండుగ అయిన సంక్రాంతితో టైటిల్ ఉంది కాబట్టి ప్రేక్షకుల ఆదరణ కూడా ఎక్కువగా ఉంటుంది. వెంకీ ఫ్యాన్స్ అయితే  సోషల్ మీడియాలో వస్తున్న టైటిల్ న్యూస్ ని చూసి ఫుల్ హ్యాపీతో  ఉన్నారు.

ఈ మూవీ  హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కబోతుంది.ఆల్రెడీ సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయని త్వరలోనే అధికార ప్రకటన రానుందని అంటున్నారు. ఆల్ రెడీ వెంకటేష్, దిల్ రాజు, అనిల్ రావిపూడి కాంబోలో ఎఫ్ 2, ఎఫ్ 3  వచ్చి మంచి విజయాన్ని సాధించాయి. ఇక సంక్రాంతికి వస్తున్నాము అనే టైటిల్ ని బట్టి సినిమా రిలీజ్ పక్కా సంక్రాంతికి ఉంటుందనే విషయం  అర్ధం అవుతుంది. మూవీకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే బయటకి రానున్నాయి. 

 



Source link

Related posts

Janasena Chief Pawan Kalyan Visits Khanapur Of Adilabad District Soon | Pawan Kalyan: ఆదిలాబాద్ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన త్వరలోనే

Oknews

Ajith enacts dangerous stunts for Vidaa Muyarchi షూటింగ్ లో అజిత్ కి ప్రమాదం

Oknews

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

Oknews

Leave a Comment