GossipsLatest News

Mega Brother Says Sorry 5.3 వ్యాఖ్యలపై నాగబాబు సారీ!



Thu 29th Feb 2024 01:20 PM

nagababu  5.3 వ్యాఖ్యలపై నాగబాబు సారీ!


Mega Brother Says Sorry 5.3 వ్యాఖ్యలపై నాగబాబు సారీ!

ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సైనికులను ఉద్దేశిస్తూ.. పోలీసు పాత్రలకు 5 అడుగుల 3 అంగుళాలు కాకుండా.. 6 అడుగుల 3 అంగుళాలు ఉంటే బాగుంటుందని మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై పెద్ద దుమారమే చెలరేగుతుంది. టాలీవుడ్‌లోని హైట్ తక్కుల హీరోలను టార్గెట్ చేస్తూ.. నాగబాబు ఆ కామెంట్స్ చేసినట్లుగా అంతా ఆయనని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలు యాదృచ్చికంగా అన్నవే కానీ.. కావాలని ఎవరినీ టార్గెట్ చేసి అన్నవి కాదని నాగబాబు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై వరుణ్ తేజ్ కూడా తన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

నాన్నగారు ఎవరినీ ఉద్దేశించి ఆ మాటలు అనలేదని, అయినా ఆయన దేశభక్తి గురించి అన్ని మాటలు చెబితే.. అవన్నీ పక్కన పెట్టి.. ఆ ఒక్క మాటనే ఎందుకు పట్టించుకుంటున్నారని వరుణ్ తేజ్ అసహనానికి గురయ్యారు. ఇప్పుడు స్వయంగా నాగబాబే ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో నాగబాబు ఏం చెప్పారంటే.. 

ఇటీవల జరిగిన వరుణ్ బాబు ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేను పోలీస్ క్యారెక్టర్ 6 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల మూడు అంగుళాల వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను, ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకునేంటే ఐయామ్ రియల్లీ వెరీ సారీ. అది యాదృచ్ఛికంగా వచ్చిందే కానీ.. వాంటెడ్‌గా అన్న మాటలు కాదు, అందరూ అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను.. -మీ నాగబాబు

 


Mega Brother Says Sorry:

Nagababu Says Sorry on his 5.3 CommentsNagababu Says Sorry on his 5.3 Comments









Source link

Related posts

రామ్ చరణ్ వల్లనే సినిమా రంగంలో గొప్ప స్థాయిలో ఉన్నానంటున్న  బిగ్  హీరో

Oknews

చైతు కోసం వస్తానని అంటే ఏమైనా అంటారా! 

Oknews

Rashmika says Vijay will support her విజయ్ సపోర్ట్ చేస్తాడంటున్న రష్మిక

Oknews

Leave a Comment