Fake Currency in Medaram Hundi: గిరిజన కుంభమేళా మేడారం (Medaram) మహా జాతర హుండీల లెక్కింపును అధికారులు గురువారం ప్రారంభించారు. పటిష్ట భద్రత మధ్య హనుమకొండ కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో దేవాదాయ సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు, మేడారం పూజారుల సమక్షంలో హుండీ ఆదాయం కౌంటింగ్ చేపట్టారు. ఈ క్రమంలో తొలి రోజే హుండీలో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం రేగింది. మొదట ఓపెన్ చేసిన హుండీలో అంబేడ్కర్ ఫోటోతో ముద్రించిన నకిలీ కరెన్సీని చూసిన సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇలా పదుల సంఖ్యలో అంబేడ్కర్ ఫోటోతో ముద్రించిన రూ.100 నోట్లు భారీగా బయటపడ్డాయి. ఇప్పటివరకూ 20కి పైగా నకిలీ కరెన్సీని గుర్తించి వాటిని పక్కన పెట్టారు. కాగా, మేడారం జాతరలో మొత్తం 518 హుండీలు ఏర్పాటు చేయగా అవన్నీ నిండిపోయాయి. అయితే, గత జాతరలో కొంత మంది భక్తులు విచిత్రంగా వారి కోరికలను పేపర్ పై రాసి హుండీలో వేశారు. ఈసారి ఫేక్ కరెన్సీ బయటపడింది.
Also Read: Karimnagar News: శభాష్ పోలీస్ – రైతును 2 కి.మీ భుజాన మోసి కాపాడిన కానిస్టేబుల్, ఎక్కడంటే?
మరిన్ని చూడండి